Breaking News

'అతడొక అండర్‌రేటెడ్‌ ప్లేయర్‌.. ఆసియాకప్‌లో ఇరగదీస్తాడు'

Published on Fri, 09/05/2025 - 18:53

ఆసియాకప్‌-2025కు టీమిండియా తమ సన్నాహాకాలను ప్రారంభించింది. ఇప్పటికే దుబాయ్‌కు చేరుకున్న భారత జట్టు శుక్రవారం తొలి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గోంది. మరో మూడు రోజుల పాటు ఐసీసీ అకాడమీలో ఏర్పాటు స్పెషల్ ట్రైనింగ్ క్యాంపులో భారత ఆటగాళ్లు చెమటోడ్చనున్నారు. 

మెన్ ఇన్ బ్లూ తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 10న యూఏఈతో తలపడనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ గురించి వెటరన్ ఆటగాడు అజింక్య రహానే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా తరపున అద్బుతంగా రాణిస్తున్నప్పటికి, అక్షర్‌కు తగినంత గుర్తింపు దక్కలేదని రహానే తెలిపాడు.

"అక్షర్ పటేల్ ఒక అండర్‌రేటెడ్‌ ప్లేయర్ అని నేను భావిస్తున్నాను. గత రెండు, మూడేళ్లలో అతడు ఒక క్రికెటర్‌గా అతడు చాలా మెరుగుపడ్డాడు. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా అద్బుతంగా రాణిస్తున్నాడు. తనకు వచ్చినప్పుడల్లా బ్యాటర్‌గా, బౌలర్‌గా తన మార్క్‌ను చూపిస్తున్నాడు. 

పవర్ ప్లేలో కొత్త బంతితో బౌలింగ్ చేసే సత్తా కూడా అక్షర్‌కు ఉంది. మిడిల్ ఫేజ్‌లో కూడా బౌలింగ్ చేయగలడు. అవసరమైతే  డెత్ ఓవర్లలో బంతితో మ్యాజిక్ చేయగలడు. అక్షర్ లాంటి ఆటగాడు జట్టులో ఉంటే కెప్టెన్ ఎప్పుడూ సంతోషంగానే ఉంటాడు. అక్షర్ ఫీల్డింగ్‌లో కూడా అద్బుతాలు చేయగలడు. ఆసియాకప్ దుబాయ్‌లో జరగనుంది. అక్కడి పిచ్‌లు ఎక్కువగా స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటాయి. 

కాబట్టి అక్షర్ జట్టుకు ఎక్స్ ఫ్యాక్టర్‌గా మారనున్నాడు" అని యూట్యూబ్ ఛానల్‌లో రహానే పేర్కొన్నాడు. కాగా ఆసియాకప్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో అక్షర్ సభ్యునిగా ఉన్నాడు.  అయితే భారత టీ20 జట్టు వైస్ కెప్టెన్సీ నుంచి మాత్రం పటేల్‌ను తప్పించారు. అతడి స్దానంలో శుబ్‌మన్ గిల్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు.
చదవండి: ODI WC 2027: ఇంగ్లండ్‌కు డేంజర్‌ బెల్స్‌.. వ‌న్డే వరల్డ్ కప్‌కు డైరెక్ట్ ఎంట్రీ కష్టమే!?

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)