Breaking News

మెస్సీని మిస్సయ్యాం!.. అర్జెంటీనా వస్తానంటే భారత్‌ వద్దన్నది

Published on Wed, 06/21/2023 - 08:26

లియోనల్‌ మెస్సీకి విశ్వవ్యాప్తంగా అభిమానులున్నారు. అతను ఒక మ్యాచ్‌ ఆడితే కోట్లలో వీక్షిస్తారు. అలాంటి మెస్సీ మన దేశానికి వచ్చి ఒక ఫ్రెండ్లీ మ్యాచ్‌ ఆడుతానంటే భారత్‌ వద్దనడం ఆశ్చర్యం కలిగించింది. అర్జెంటీనా ప్రస్తుతం ఫుటబాల్‌లో చాంపియన్‌ అన్న సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్‌లో ఖతర్‌ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో మెస్సీ సేన ఫ్రాన్స్‌పై ఫూటౌట్‌లో 4-2తో విజయం సాధించి మూడోసారి వరల్డ్‌కప్‌ గెలుచుకుంది. అన్నీ తానై నడిపించిన మెస్సీ అర్జెంటీనాకు కప్‌ అందించి 36 సంవత్సరాల నిరీక్షణకు తెరదించాడు.

ఇలాంటి మేటి చాంపియన్‌ టీమ్‌ వచ్చి ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడతామంటే ఫుట్‌బాల్‌ అభివృద్ధి కోరే ఏ దేశమైనా ఎగిరి గంతేస్తుంది. ఎర్రతివాచీ పరిచి మరీ ఆహ్వానిస్తుంది. కానీ జనాభాలో చైనాను మించిన భారత్‌ మాత్రం తమ ఫుట్‌బాల్‌ అబిమానులకు నిరాశ కలిగించే నిర్ణయంతో అర్జెంటీనా వస్తనంటే వద్దన్నది. అర్జెంటీనా జట్టు అయినా.. ఆ జట్టు ఆటగాళ్లయినా మోస్ట్‌ వాల్యుబుల్‌ ప్లేయర్స్‌. అలాంటి జట్టు అప్పియరెన్స్‌ ఫీజుగా 50 లక్షల డాలర్లు(రూ.40 కోట్లు) ఇస్తే చాలు అందుబాటులో ఉన్న జూన్‌ 12 నుంచి 20వ తేదీల్లో భారత్‌ వేదికపై ఒక మ్యాచ్‌ ఆడి వెళతామంది.

కానీ అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య(AIFF) అంత మొత్తం ఇవ్వలేం అనేసరికి మెస్సీ టీమ్‌ జూన్‌ 15న బీజింగ్‌లో ఆస్ట్రేలియాతో ఫ్రెండ్లీ మ్యాచ్‌ ఆడింది. మనకంటే చిన్నదేశం ఇండోనేషియా వాళ్లు అడిగినంత ఫీజులో ఏ లోటు లేకుండా చెల్లించి జకార్తాలో 19న అర్జెంటీనాతో మ్యాచ్‌ ఆడి తమ కోరికను నెరవేర్చుకుంది. అభివృద్ది చెందుతున్న దేశాల జాబితాలో ఉన్న మన భారత్‌ మాత్రం రూ. 40 కోట్లు ఇచ్చుకోలేక అర్జెంటీనాతో మ్యాచ్‌ ఆడేందుకు నిరాకరించడం విస్మయం కలిగించే అంశం.

చదవండి: #LionelMessi: ఆపడం ఎవరి తరం.. కెరీర్‌లోనే అత్యంత ఫాస్టెస్ట్‌ గోల్‌

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)