Breaking News

ద‌క్షిణాఫ్రికా స్టార్ ఓపెన‌ర్‌కు ఐసీసీ ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు

Published on Mon, 07/14/2025 - 16:06

సౌతాఫ్రికా స్టార్ ప్లేయ‌ర్ ఐడైన్ మార్‌క్ర‌మ్.. జూన్ నెల‌కు గాను ఐసీసీ ప్లేయ‌ర్ ఆఫ్‌ది మంత్ అవార్డు గెలుచుకున్నాడు.  గ‌త నెల‌లో డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌లో ఆస్ట్రేలియాపై అద్బుత ప్ర‌ద‌ర్శ‌న‌కు గాను మార్‌క్ర‌మ్‌కు ఈ ప్ర‌తిషాత్మ‌క అవార్డు ద‌క్కింది. ఫైన‌ల్ మ్యాచ్‌లో సెంచరీతో చెల‌రేగిన మార్‌క్ర‌మ్‌..సౌతాఫ్రికాకు 28 ఏళ్ల త‌ర్వాత తొలి ఐసీసీ టైటిల్‌ను అందించాడు.

ఈ మ్యాచ్‌లో బంతితో కూడా అత‌డు రాణించాడు. ఈ అవార్డు కోసం మార్‌క్ర‌మ్‌తో పాటు త‌న స‌హ‌చ‌రుడు టెంబా బావుమా, శ్రీలంక ఓపెన‌ర్  పాతుమ్ నిస్సాంక పోటీ ప‌డ్డారు. కానీ కీల‌కమైన ఫైన‌ల్లో సెంచ‌రీతో చేయ‌డంతో మార్‌క్ర‌మ్‌ వారిద్ద‌రిని వెన‌క్కి నెట్టి ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు.

ఈ ప్రతిష్టత్మ‌క‌ ఐసీసీ అవార్డు అందుకోవ‌డం త‌నకు ద‌క్కిన అరుదైన గౌర‌వ‌మ‌ని మార్‌క్ర‌మ్ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నాడు.  మ‌రోవైపు మ‌హిళ‌ల విభాగంలో ఈ అవార్డును వెస్టిండీస్ కెప్టెన్ హీలీ మాథ్యూస్ సొంతం చేసుకుంది. గ‌త నెల‌లో ద‌క్షిణాఫ్రికా మ‌హిళ‌ల జ‌ట్టుతో జ‌రిగిన వ‌న్డే, టీ20 సిరీస్‌ల‌లో మాథ్యూస్ ఆసాధ‌ర‌ణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచింది.

రెండు సిరీస్‌లలోనూ ఆల్ రౌండ్ షోతో మాథ్యూస్ అద‌ర‌గొట్టింది. దీంతో ఆమె దక్షిణాఫ్రికాకు చెందిన టాజ్మిన్ బ్రిట్స్, వెస్టిండీస్‌స్పిన్న‌ర్‌ అఫీ ఫ్లెచర్‌లను అధిగమించి ఈ అవార్డును గెలుచుకుంది.
చదవండి: IND vs ENG: సిరాజ్‌కు భారీ షాకిచ్చిన ఐసీసీ
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)