Breaking News

ఆసియా కప్‌లో భారత్‌-పాక్‌ మ్యాచ్‌.. కోహ్లిని గుర్తు చేసుకున్న యువ క్రికెటర్లు

Published on Tue, 07/18/2023 - 16:12

భారత్‌-పాకిస్తాన్‌ల మధ్య ఏ క్రీడలో అయినా, ఏ స్థాయి మ్యాచ్‌ అయినా భారీ అంచనాలు కలిగి ఉంటుందన్న విషయం తెలిసిందే. దాయాదుల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ అయితే, దాని గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. క్రికెటర్లతో పాటు అభిమానులు తీవ్ర భావోద్వేగాలకు లోనవుతారు. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ ఎమర్జింగ్‌ టీమ్స్‌ ఆసియా కప్‌ 2023 ద్వారా ఇరు దేశాల క్రికెటర్లు, అభిమానులకు మరోసారి ఆ భావోద్వేగానుభూతికి లోనయ్యే అవకాశం దొరికింది.

టోర్నీలో భాగంగా రేపు (జులై 19) భారత్‌-ఏ, పాకిస్తాన్‌-ఏ జట్లు తలపడనున్నాయి. ​కొలొంబో వేదికగా జరిగే ఈ మ్యాచ్‌ రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌ ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. వన్డే ఫార్మాట్‌లో జరిగే ఈ మ్యాచ్‌ కోసం యువ భారత క్రికెటర్లు, పాకిస్తాన్‌ ఆటగాళ్లు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా రాణించి, అభిమానుల మనసుల్లో చిరకాలం కొలువుండిపోవాలని ఉవ్విళ్లూరుతున్నారు.

భారత-ఏ క్రికెటర్లయితే తమ ఆరాధ్య క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి చివరిసారి పాకిస్తాన్‌పై ఆడిన ఇన్నింగ్స్‌ను గుర్తుచేసుకుంటూ తాము ​కూడా అదే స్థాయి ఇన్నింగ్స్‌ ఆడాలని కలలు కంటున్నారు. నేపాల్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో సెన్సేషనల్‌ ఇన్నింగ్స్‌ ఆడిన అభిషేక్‌ శర్మ (87) స్టార్‌ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. తన దృష్టిలో ఆసియా కప్‌-2022లో పాక్‌తో జరిగిన మ్యాచ్లో కోహ్లి ఆడిన ఇన్నింగ్స్‌ అత్యుత్తమ టీ20 ఇన్నింగ్స్‌ అని అన్నాడు.

మరో భారత-ఏ జట్టు సభ్యుడు రియాన్‌ పరాగ్‌ మాట్లాడుతూ.. ఆసియా కప్‌లో పాక్‌తో మ్యాచ్‌ సందర్భంగా కోహ్లి ముఖంలో, కళ్లలో కనిపించిన కసి అత్యద్భుతమని కొనియాడాడు. నేపాల్‌తో మ్యాచ్‌లో రాణించిన సాయి సుదర్శన్‌ మాట్లాడుతూ.. ఆసియా కప్‌లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో హరీస్‌ రౌఫ్‌ బౌలింగ్‌ కోహ్లి కొట్టిన ఓ షాట్‌ సూపర్‌ హ్యూమన్‌ షాట్‌ అని అభిప్రాయపడ్డాడు. ఈ ముగ్గురు యువ క్రికెటర్లు రేపు పాక్‌తో జరిగే మ్యాచ్‌లో కోహ్లిలా చెలరేగాలని అనుకుంటున్నట్లు తెలిపారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)