నబీ విధ్వంసం.. ఆఫ్ఘనిస్తాన్‌ భారీ స్కోర్‌

Published on Tue, 10/14/2025 - 21:27

మూడు మ్యాచ్‌ సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో (Bangladesh) ఇవాళ (అక్టోబర్‌ 14) జరుగుతున్న నామమాత్రపు మూడో వన్డేలో ఆఫ్ఘనిస్తాన్‌ (Afghanistan) భారీ స్కోర్‌ చేసింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఈ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 293 పరుగులు చేసింది.

ఓపెనర్‌ ఇబ్రహీం జద్రాన్‌ (Ibrahim Zadran) (111 బంతుల్లో 95; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్హమైన సెంచరీని రనౌటై, చేజార్చుకున్నాడు. మరో ఓపెనర్‌ రహ్మానుల్లా గుర్బాజ్‌ (44 బంతుల్లో 42; 5 ఫోర్లు, సిక్స్‌) కూడా రాణించాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 99 పరుగులు జోడించారు. ఆతర్వాత జద్రాన్‌ సెదిఖుల్లా అటల్‌ (29) సాయంతో ఇన్నింగ్స్‌ను పటిష్ట పరిచాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 74 పరుగులు జోడించారు.

అయితే సెదిఖుల్లా ఔటయ్యాక ఆఫ్ఘన్‌ ఇన్నింగ్స్‌ ఒక్కసారిగా కుదుపుకు లోనైంది. 76 పరుగుల వ్యవధిలో 8 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో వెటరన్‌ మొహమ్మద్‌ నబీ (Mohammad Nabi) జూలు విదిల్చాడు. బంగ్లా బౌలర్లపై సునామీలా విరుచుకుపడ్డాడు. 

చివరి రెండు ఓవర్లలో 44 పరుగులు పిండుకున్నాడు. నబీ ధాటికి ఆఫ్ఘన్‌ స్కోర్‌ రాకెట్‌లా పైకెళ్లి పోయింది. 249 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్‌ పడ్డ తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌ ఇన్నింగ్స్‌ ముగియడం లాంఛనమే అనుకున్నారు.

అయితే నబీ ఒక్కసారిగా పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో నబీ 37 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 62 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 

నబీ ఇటీవల షార్జాలో కూడా ఇలాంటి సునామీ ఇన్నింగ్సే ఆడాడు. ఈ మ్యాచ్‌లో బంగ్లా బౌలర్లు తొలుత పట్టు కోల్పోయినా, ఆతర్వాత పుంజుకున్నారు. సైఫ్‌ హసన్‌ 3, హసన్‌ మహమూద్‌, తన్వీర్‌ ఇస్లాం తలో 2, రిషద్‌ హొసేన్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. 

కాగా, ఈ సిరీస్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి ఇదివరకే సిరీస్‌ను కైవసం చేసుకుంది.

చదవండి: టీమిండియా ఎన్నో స్థానంలో ఉందంటే..?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)