Breaking News

చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్‌.. రోహిత్‌, గేల్‌కు కూడా సాధ్యం కాని ఘనత సొంతం

Published on Mon, 01/01/2024 - 15:11

పొట్టి ఫార్మాట్‌లో యూఏఈ కెప్టెన్‌, పాకిస్తాన్‌ ఆటగాడు ముహమ్మద్‌ వసీం చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు ఏ ఆటగాడి​కి సొంతం కాని అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో 100 అంతకంటే ఎక్కువ సిక్సర్లు బాదిన తొలి అంతర్జాతీయ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. టీ20ల్లో సిక్సర్ల వీరులుగా పేరున్న రోహిత్‌ శర్మ, క్రిస్‌ గేల్‌ సైతం ఈ ఫీట్‌ సాధించలేకపోయారు.

ఆఫ్ఘనిస్తాన్‌తో నిన్న జరిగిన రెండో టీ20లో వసీం ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో మూడు సిక్సర్లు బాదిన వసీం.. 2023 క్యాలెండర్‌ ఇయర్‌లో 100 సిక్సర్లు బాదిన తొలి ​క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ ఏడాది మొత్తం 47 అంతర్జాతీయ టీ20లు ఆడిన వసీం.. 101 సిక్సర్లు తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో వసీం తర్వాత ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఘనత టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పేరిట ఉంది.

హిట్‌మ్యాన్‌ ఈ ఏడాది టీ20ల్లో 80 సిక్సర్లు (35 మ్యాచ్‌ల్లో) బాదాడు. ఈ విభాగంలో ఆ తర్వాతి రెండు స్థానాలు కూడా రోహిత్‌ శర్మ పేరిటే ఉన్నాయి. 2019, 2018 క్యాలెండర్‌ ఇయర్స్‌లో హిట్‌మ్యాన్‌ వరుసగా 78, 74 సిక్సర్లు బాదాడు. ఈ విభాగంలో ఐదో స్థానంలో టీమిండియా విధ్వంసకర వీరుడు సూర్యకుమార్‌ యాదవ్‌ ఉన్నాడు. స్కై 2022లో 74 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో వీరి తర్వాత యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ ఉన్నాడు. గేల్‌ 2012లో 26 మ్యాచ్‌ల్లో 59 సిక్సర్లు కొట్టాడు. 

ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన నిన్నటి మ్యాచ్‌లో ముహమ్మద్‌ వసీం 32 బంతుల్లో 3 సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో 53 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌ ఆడటంతో యూఏఈ సంచలన విజయం సాధించింది. వసీంతో పాటు ఆర్యన్‌ లక్రా (63 నాటౌట్‌) కూడా అర్ధసెంచరీతో రాణించడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది.

ఛేదనలో తడబడిన ఆఫ్ఘనిస్తాన్‌ 19.5 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటై, 11 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ముహమ్మద్‌ జవాదుల్లా (4/26), అలీ నసీర్‌ (4/24) ఆఫ్ఘనిస్తాన్‌ పతనాన్ని శాశించారు. ఆఫ్ఘన్‌ ఇన్నింగ్స్‌లో మొహమ్మద్‌ నబీ (47) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఈ గెలుపుతో యూఏఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. నిర్ణయాత్మకమైన మూడో టీ20 జనవరి 2న  జరుగనుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)