Breaking News

గోల్డ్‌ మెడల్‌తో సర్‌ప్రైజ్‌ చేసిన హాలీవుడ్‌ హీరో​

Published on Fri, 09/23/2022 - 09:16

వెనమ్‌(VenoM), మ్యాడ్‌మాక్స్‌ ఫ్యూరీ రోడ్‌.. ఫేమ్‌ హాలీవుడ్‌ హీరో టామ్‌ హార్డీ(ఎడ్వర్డ్‌ థామస్‌) పేరు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. హీరోగా పేరు తెచ్చుకొని మళ్లీ పాపులర్‌ అవడం ఏంటని డౌట్‌ వద్దు. విషయంలోకి వెళితే.. మార్షల్‌ ఆర్ట్‌ కాంపిటీషన్‌లో పాల్గొన్న టామ్‌ హార్డీ ఏకంగా గోల్డ్‌ మెడల్‌ కొల్లగొట్టడం విశేషం.

45 ఏళ్ల వయసులో మార్షల్‌ ఆర్ట్స్‌లోకి ఎంటరైన టామ్‌ హార్డీ 2022 బ్రెజిలియన్ జియు-జిట్సు ఓపెన్ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాడు. సెప్టెంబర్‌ 17న అల్టిమేట్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్‌ ఆధ్వర్యంలో మిల్టన్ కీన్స్‌లోని ఓక్‌గ్రోవ్ స్కూల్‌లో ఈ పోటీని నిర్వహించారు. నీలిరంగు దుస్తులు ధరించిన టామ్‌ హార్డీ.. తన అసలు పేరు ఎడ్వర్డ్‌ థామస్‌గా బరిలోకి దిగడం విశేషం. కాగా పోటీలో ప్రత్యర్థికి అవకాశం ఇవ్వని టామ్‌ హార్డీ పట్టుతో ఉక్కిరిబిక్కిరి చేశాడు. మ్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఇక టామ్‌ హార్డీ మార్షల్‌ ఆర్ట్స్‌ గేమ్స్‌లో పాల్గొనడంపై మ్యాచ్‌ నిర్వాహకులు స్పందించారు. టామ్‌ హార్డీ చాలా మంచి వ్యక్తి. అతని యాక్టింగ్‌ తెలిసిన ప్రతీ ఒక్కరు గుర్తుపడతారు. మేం పిలిచిన వెంటనే ఒక గెస్ట్‌గా హాజరవడమే గాక మ్యాచ్‌ ఆడడంతో పాటు అభిమానులకు ఫోటోలు ఇవ్వడం అతని మంచి మనుసును తెలియజేస్తుంది. ఇలాంటి ఈవెంట్‌కు టామ​ హార్డీ రావడం మా అదృష్టం అని పేర్కొన్నారు. మ్యాచ్‌ అనంతరం గోల్డ్‌ మెడల్‌తో పాటు సర్టిఫికేట్‌ పొందిన టామ్‌ హార్డీ మాట్లాడాడు. ''ఈ విజయం వర్ణించలేనిది.. ఎందుకంటే నేనింకా షాక్‌లోనే ఉన్నా..  ఏం మాట్లాడాలో తెలియడం లేదు'' అంటూ పేర్కొన్నాడు. 

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)