Breaking News

విధ్వంసం సృష్టించిన వైభవ్‌ సూర్యవంశీ.. ఫైనల్లో భారత్‌

Published on Fri, 12/06/2024 - 16:02

అండర్‌-19 ఆసియా కప్‌ 2024లో భారత్‌ ఫైనల్‌కు చేరింది. ఇవాళ (డిసెంబర్‌ 6) జరిగిన రెండో సెమీఫైనల్లో భారత్‌ 7 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం​ సాధించింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక.. భారత బౌలర్లు చేతన్‌ శర్మ (3/34), కిరణ్‌ చోర్మలే (2/32), ఆయుశ్‌ మాత్రే (2/37), యుధజిత్‌ గుహా (1/19), హార్దిక్‌ రాజ్‌ (1/30) ధాటికి 46.2 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌటైంది. 

శ్రీలంక ఇన్నింగ్స్‌లో లక్విన్‌ అభయ్‌సింఘే (69) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. షరుజన్‌ షణ్ముగనాథన్‌ (42), విహాస్‌ తేవ్మిక (14), కవిజ గమగే (10) రెండంకెల స్కోర్లు చేశారు.

174 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యంగ్‌ ఇండియా.. వైభవ్‌ సూర్యవంశీ (36 బంతుల్లో 67; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో 21.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. 

భారత ఇన్నింగ్స్‌లో ఆయుశ్‌ మాత్రే (34), ఆండ్రీ సిద్దార్థ్‌ (22), కెప్టెన్‌ మొహమ్మద్‌ అమాన్‌ (25 నాటౌట్‌), కేపీ కార్తికేయ (11) కూడా ఓ మోస్తరు స్కోర్లు చేశారు. లంక బౌలర్లలో విహాస్‌ తేవ్మిక, విరన్‌ చముదిత, ప్రవీణ్‌ మనీషా తలో వికెట్‌ పడగొట్టారు. 

కాగా, ఇటీవల జరిగిన ఐపీఎల్‌ 2025 మెగా వేలంలో వైభవ్‌ సూర్యవంశీని రాజస్థాన్‌ రాయల్స్‌ ఫ్రాంచైజీ 1.1 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌ వేలంలో పాల్గొన్న అత్యంత పిన్న వయస్కుడిగా సూర్యవంశీ రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం సూర్యవంశీ వయసు 13 ఏళ్లు. 

పాకిస్తాన్‌ను చిత్తు చేసిన బంగ్లాదేశ్‌
ఇవాళే జరిగిన తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌ పాకిస్తాన్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ 37 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌట్‌ కాగా.. బంగ్లాదేశ్‌ 22.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. డిసెంబర్‌ 8న జరిగే ఫైనల్లో బంగ్లాదేశ్‌ భారత్‌ను ఢీకొంటుంది. 
 


 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)