Breaking News

ఒకే రోజు రెండు సంచలనాలు.. పసికూనల చేతిలో భారత్‌, పాక్‌లకు పరాభవం

Published on Fri, 12/15/2023 - 19:58

అండర్‌-19 ఆసియా కప్‌లో ఒకే రోజు రెండు సంచలనాలు నమోదయ్యాయి. పసికూనలైన బంగ్లాదేశ్‌, యూఏఈల చేతుల్లో మాజీ ఛాంపియన్లు భారత్‌, పాకిస్తాన్‌ ఓటమిపాలయ్యాయి. ఇవాళ (డిసెంబర్‌ 15) జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌ల్లో తొలుత యూఏఈ పాకిస్తాన్‌ను మట్టికరిపించగా.. ఆతర్వాతి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ టీమిండియాకు షాకిచ్చింది. ఫలితంగా యూఏఈ, బంగ్లాదేశ్‌ జట్లు ఫైనల్‌కు చేరాయి. దుబాయ్‌ వేదికగా డిసెంబర్‌ 17న ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది.

మ్యాచ్‌ల విషయానికొస్తే.. పాకిస్తాన్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో తొలుత బ్యాటింగ్‌ చేసిన యూఏఈ.. 47.5 ఓవర్లలో 193 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. పాక్‌ పేసర్‌ ఉబెయిద్‌ షా (4/43) యూఏఈ పతనాన్ని శాశించాడు. యూఏఈ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ అయాన్‌ ఖాన్‌ (55) అర్దసెంచరీతో రాణించగా.. ఓపెనర్‌ ఆర్యాన్ష్‌ శర్మ (46), డిసౌజా (37) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. 

స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్‌.. యూఏఈ బౌలర్లు మూకుమ్మడిగా అటాకింగ్‌ చేయడంతో 49.3 ఓవర్లలో 182 పరుగులకే ఆలౌటైంది. పాక్‌ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ సాద్‌ బేగ్‌ (50), అజాన్‌ అవైస్‌ (41) మాత్రమే రాణించారు. యూఏఈ బౌలర్లలో అయ్మాన్‌ అహ్మద్‌, హార్దిక్‌ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. రెహ్మాన్‌, ధృవ్‌, బదామీ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

ఇక బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో సెమీఫైనల్లో తొలుత బ్యాటింగ్‌ చేసిన యువ భారత్‌.. 42.4 ఓవర్లలో 188 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో ముషీర్‌ ఖాన్‌ (50), మురుగన్‌ అభిషేక్‌ (62) అర్ధసెంచరీలతో రాణించారు. బంగ్లా బౌలర్ మరూఫ్‌ 4 వికెట్లు పడగొట్టి టీమిండియా పతనాన్ని శాశించాడు. 

అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్‌.. అరీఫుల్‌ ఇస్లాం (94) చెలరేగడంతో 42.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. అరీఫుల్‌కు అహ్రార్‌ అమీన్‌ (44) సహకరించాడు. నమన్‌ తివారీ (3/35), రాజ్‌ లింబానీ (2/47) చివరి వరకు ప్రయత్నించినప్పటికీ టీమిండియాను గెలిపించలేకపోయారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)