Breaking News

Asia Cup 2023: టీమిండియాకు పరాభవం.. ఫైనల్లో పాక్‌ చేతిలో ఓటమి

Published on Sun, 07/23/2023 - 21:24

ఏసీసీ మెన్స్‌ ఎమర్జింగ్‌ టీమ్స్‌ ఆసియా కప్‌ ఫైనల్లో పాకిస్తాన్‌-ఏ..​ భారత-ఏ జట్టుకు షాకిచ్చింది. కొలొంబో వేదికగా ఇవాళ (జులై 23) జరిగిన తుది సమరంలో పాక్‌ 128 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. 353 భారీ లక్ష్య ఛేదనలో తడబడిన టీమిండియా.. 224 పరుగులకు ఆలౌటైంది.

భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియాకు సైతం శుభారంభమే లభించినప్పటికీ, భారత ప్లేయర్లు దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యారు. 61 పరుగులు చేసిన ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. మరో ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ (29), కెప్టెన్‌ యశ్‌ ధుల్‌ (39) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. పాక్‌ బౌలర్లలో సుఫియాన్‌ ముఖీమ్‌ 3 వికెట్లు పడగొట్టి టీమిండియాను దెబ్బకొట్టగా.. అర్షద్‌  ఇక్బాల్‌, మెహ్రాన్‌ ముంతాజ్‌, మహ్మద్‌ వసీం జూనియర్‌ తలో 2 వికెట్లు, ముబాసిర్‌ ఖాన్‌ ఓ వికెట్‌ పడగొట్టాడు.   

అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్లు సైమ్‌ అయూబ్‌ (51 బంతుల్లో 59; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), సాహిబ్‌జాదా  ఫర్హాన్‌ (62 బంతుల్లో 65; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్ని అందించగా.. నాలుగో స్థానంలో బరిలోకి దిగిన తయ్యబ్‌ తాహిర్‌ (71 బంతుల్లో 108; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు.

పాక్‌ ఇన్నింగ్స్‌లో అయూబ్‌, ఫర్హాన్‌, తాహిర్‌లతో పాటు ఒమైర్‌ యూసఫ్‌ (35), ముబాసిర్‌ ఖాన్‌ (35) కూడా రాణించారు. భారత బౌలర్లలో హంగార్గేకర్‌, రియాన్‌ పరాగ్‌ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. హర్షిత్‌ రాణా, మానవ్‌ సుతార్‌, నిషాంత్‌ సింధు తలో వికెట్‌ దక్కించుకున్నారు. 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?