Breaking News

అభిషేక్‌ శర్మ ఊచకోత.. యూఏఈపై టీమిండియా ఘన విజయం

Published on Mon, 10/21/2024 - 21:31

టీ20 ఎమర్జింగ్‌ టీమ్స్‌ ఆసియా కప్‌ 2024 టోర్నీలో భాగంగా యూఏఈతో ఇవాళ (అక్టోబర్‌ 21) జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన యూఏఈ.. భారత బౌలర్ల ధాటికి 16.5 ఓవర్లలో 107 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా పేసర్‌ రసిఖ్‌ సలామ్‌ ఐదు బంతుల వ్యవధిలో మూడు వికెట్లు తీసి యూఏఈని చావుదెబ్బ కొట్టాడు. అనంతరం​ రమణ్‌దీప్‌ సింగ్‌ రెండు ఓవర్లలో రెండు వికెట్లు పడగొట్టాడు. 

అన్షుల్‌ కంబోజ్‌, వైభవ్‌ అరోరా, అభిషేక్‌ శర్మ, నేహల్‌ వధేరా తలో వికెట్‌ దక్కించుకున్నారు. యూఏఈ ఇన్నింగ్స్‌లో రాహుల్‌ చోప్రా ఒక్కడే ఒంటరిపోరాటం చేశాడు. రాహుల్‌ 50 బంతుల్లో​ 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేసి చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. యూఏఈ ఇన్నింగ్స్‌లో రాహుల్‌తో పాటు కెప్టెన్‌ బాసిల్‌ హమీద్‌ (12 బంతుల్లో 22; ఫోర్‌, 2 సిక్సర్లు), మయాంక్‌ రాజేశ్‌ కుమార్‌ (5 బంతుల్లో 10; ఫోర్‌, సిక్స్‌) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.

అభిషేక్‌ శర్మ ఊచకోత..
స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌.. అభిషేక్‌ శర్మ (24 బంతుల్లో 58; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో 10.5 ఓవర్లలో విజయతీరాలకు చేరింది. భారత ఇన్నింగ్స్‌లో తిలక్‌ వర్మ 21, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ 8, అభిషేక్‌ 58 పరుగులు చేసి ఔట్‌ కాగా.. నేహల్‌ వధేరా 6, ఆయుశ్‌ బదోని 12 పరుగులతో అజేయంగా నిలిచారు.

 

 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)