Breaking News

ఎట్టకేలకు ఆసియా కప్‌ 2023 షెడ్యూల్‌ విడుదల

Published on Fri, 06/16/2023 - 07:20

ఎట్టకేలకు ఆసియా కప్‌ వన్డే క్రికెట్‌ టోర్నమెంట్‌ షెడ్యూల్‌ను ఖరారు చేశారు. పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ఆధ్వర్యంలో జరగనున్న ఈ టోర్నీని ‘హైబ్రిడ్‌ మోడల్‌’లో నిర్వహించేందుకు జై షా అధ్యక్షుడిగా ఉన్న ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. ఆగస్టు 31 నుంచి సెపె్టంబర్‌ 17 వరకు ఈ టోర్నీని నిర్వహిస్తారు.

పాకిస్తాన్‌లో 4 మ్యాచ్‌లు... శ్రీలంకలో 9 మ్యాచ్‌లు జరుగుతాయి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, నేపాల్‌ జట్లు టైటిల్‌ కోసం పోటీపడతాయి. ఆరు జట్లను రెండు గ్రూప్‌లుగా (మూడు జట్లు చొప్పున) విభజించారు. ఒక గ్రూప్‌లో భారత్, పాకిస్తాన్, నేపాల్‌... మరో గ్రూప్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ జట్లున్నాయి.

గ్రూప్‌ దశ తర్వాత రెండు గ్రూప్‌ల నుంచి రెండేసి జట్లు ‘సూపర్‌ ఫోర్‌’ దశకు అర్హత సాధిస్తాయి. ‘సూపర్‌ ఫోర్‌’ దశ తర్వాత టాప్‌–2లో నిలిచిన జట్లు ఫైనల్‌కు చేరుకుంటాయి. పాకిస్తాన్‌లోని నాలుగు మ్యాచ్‌లకు లాహోర్‌ వేదికగా నిలుస్తుంది. శ్రీలంకలో క్యాండీ, పల్లెకెలెలో మ్యాచ్‌లు ఉంటాయి.

ఈ ఏడాది వన్డే వరల్డ్‌ కప్‌ ఉండటంతో ఈసారి ఆసియా కప్‌ను వన్డే ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. అయితే మ్యాచ్‌ల షెడ్యూల్‌ను తర్వాత ప్రకటిస్తారు. గత ఏడాది టి20 వరల్డ్‌కప్‌ జరగడంతో ఆసియా కప్‌ టోర్నీని టి20 ఫార్మాట్‌లో నిర్వహించగా... ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి శ్రీలంక విజేతగా నిలిచింది.    
 

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)