చరిత్ర సృష్టించిన అభిషేక్‌ శర్మ

Published on Sun, 07/26/2026 - 10:20

భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో ఓ అరుదైన రికార్డు సాధించాడు. బ్యాట్‌తో మరోసారి నిరాశపరిచినప్పటికీ, బంతితో అద్భుత ప్రదర్శన (3-17) చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో అతను అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన భారత ఓపెనింగ్‌ బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు.  

మూడు ఫార్మాట్లలో భారత ఓపెనర్ల అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు:
* టెస్టులు: వినూ మాంకడ్ – 8/52 (పాకిస్థాన్‌పై, 1952)
* వన్డేలు: రవి శాస్త్రి – 5/15 (ఆస్ట్రేలియాపై, 1991)
* టీ20లు: అభిషేక్ శర్మ – 3/17 (జింబాబ్వేపై, 2026)

అభిషేక్‌కు తోడుగా యశ్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీయడంతో జింబాబ్వే 220 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేవలం 129 పరుగులకే ఆలౌటై, 90 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైంది. ఫలితంగా భారత్‌ మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌ టీమిండియానే గెలిచింది. నామమాత్రపు మూడో టీ20 ఇవాళే (జులై 26) జరుగనుంది. భారత టీ20 జట్టు కెప్టెన్‌గా శ్రేయస్‌ అ‍య్యర్‌కు ఇది తొలి సిరీస్‌ విజయం.

బ్యాట్‌తో తడబడుతున్న అభిషేక్‌
అభిషేక్‌ ఈ మ్యాచ్‌లో బంతితో రాణించినా, గత కొన్ని ఇన్నింగ్స్‌లుగా బ్యాట్‌తో తడబడుతున్నాడు. చివరిగా ఇంగ్లండ్‌తో తొలి టీ20లో అర్ద సెంచరీ చేసిన అతడు.. ఆతర్వాత వరుసగా 43, 10, 16, 3, 1 పరుగుకు ఔటయ్యాడు.

నిన్నటి రెండో టీ20లో ఓ మోస్తరు స్టార్ట్‌ లభించినప్పటికీ సద్వినియోగం చేసుకోలేక వికెట్‌ పారేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతడు 8 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 8 పరుగులు చేసి బ్లెస్సింగ్‌ ముజరబానీ బౌలింగ్‌లో ర్యాన్‌ బర్ల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 
 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)