అభిషేక్‌ శర్మ విధ్వంసం.. కేవలం 9 బంతుల్లోనే!

Published on Thu, 12/04/2025 - 21:20

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియా యువ ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ దుమ్ములేపుతున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అభిషేక్‌.. గురువారం పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 

తాను ఎదుర్కొన్న తొలి బంతి నుంచే ప్రత్యర్ధి బౌలర్లను శర్మ ఉతికారేశాడు. ఉప్పల్‌ మైదానంలో అభిషేక్‌ క్రీజులో ఉన్నంత సేపు బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 9 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34 పరుగులు చేశాడు. అతడితో పాటు సలీల్ అరోరా(44), రమణ్‌దీప్‌ సింగ్‌(34), శన్వీర్‌ సింగ్‌(38) కీలక నాక్స్‌ ఆడారు. 

ఫలితంగా పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. పుదుచ్చేరి బౌలర్లలో రాజా రెండు, అయూబ్‌ తండా, జయంత్‌ యాదవ్‌ ఒక్క వికెట్‌ సాధించారు. అనంతరం లక్ష్య చేధనలో పుదుచ్చేరి 18.4 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. 

సైదక్‌ సింగ్‌(61) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. మిగితా బ్యాటర్లందరూ విఫలమయ్యారు. అభిషేక్‌ శర్మ బౌలింగ్‌లో కూడా మూడు వికెట్లతో సత్తాచాటాడు. అతడితో పాటు అయూష్‌ గోయల్‌ మూడు, హర్‌ప్రీత్‌ బ్రార్‌ రెండు వికెట్లు సాధించారు.

కాగా ఈ టోర్నీలో బెంగాల్‌తో జరిగిన  మ్యాచ్‌లో అభిషేక్‌ కేవలం 52 బంతుల్లోనే 148 పరుగులు చేసి వరల్డ్‌ రికార్డు సృష్టించాడు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌ నేపథ్యంలో పంజాబ్‌ జట్టు నుంచి అభిషేక్‌ వైదొలిగే అవకాశముంది. టీ20 సిరీస్‌ డిసెంబర్‌ 9 నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: దుమ్ములేపిన మ‌హ్మ‌ద్ ష‌మీ.. ఇప్పటికైనా క‌ళ్లు తెర‌వండి!
 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)