Breaking News

సోదరా... రోహిత్‌కు పాప్‌కార్న్‌ ఇవ్వకు: అభిషేక్‌

Published on Mon, 10/20/2025 - 08:45

భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే సందర్భంగా జరిగిన ఓ సంఘటన చర్చనీయాంశమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో శుబ్‌మన్‌ గిల్‌ సారథ్యంలోని భారత జట్టు 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. వర్షం కారణంగా మ్యాచ్‌కు పలుమార్లు అంతరాయం వాటిల్లగా... చివరకు 26 ఓవర్లకు కుదించాల్సి వచ్చింది.

అయితే మ్యాచ్‌కు పదేపదే వర్షం ఆటంకం కల్పించినప్పుడు ప్లేయర్లు డ్రెస్సింగ్‌ రూమ్‌లో సేదతీరుతూ కనిపించారు. ఆ సమయంలో వ్యాఖ్యాతగా ఉన్న టీమిండియా మాజీ  అసిస్టెంట్‌ కోచ్‌ అభిషేక్‌ నాయర్‌ తన స్నేహితుడైన రోహిత్‌ శర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌తో కలిసి పాప్‌కార్న్‌ తింటున్న రోహిత్‌ను చూస్తూ... ‘అరే భాయ్‌ ఉసే పాప్‌కార్న్‌ మత్‌ దే’ (సోదరా అతడికి పాప్‌కార్న్‌ ఇవ్వకు) అంటూ కామెంట్‌ చేశాడు.

టెస్టు, టి20 ఫార్మాట్‌లకు వీడ్కోలు పలికిన రోహిత్‌ శర్మ... ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్‌ వరకు జట్టులో కొనసాగాలని భావిస్తున్న హిట్‌మ్యాన్‌... ఇటీవల ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాడు. చాంపియన్స్‌ ట్రోఫీ విజయం అనంతరం వచ్చిన విరామంలో... ఏకంగా 11 కేజీల బరువు తగ్గాడు. 

దీనిపై మ్యాచ్‌కు ముందు అభిషేక్‌ మాట్లాడుతూ... ‘రోహిత్‌ పూర్తిగా మారిపోయాడు. మరింత ఫిట్‌గా, మరింత దృఢంగా మారాడు. ఫిట్‌నెస్‌ పెంపొందించుకుంటే... నైపుణ్యం దానంతటదే పెరుగుతుంది. ఈ విషయంలో రోహిత్‌ చాలా కష్టపడ్డాడు. ఇదంతా 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకునే కావచ్చు. అప్పటి వరకు ఆటలో కొనసాగాలంటే మొదట తన బరువు తగ్గించుకోవాలని రోహిత్‌ బలంగా అనుకున్నాడు. దాని వల్లే ఇదంతా సాధ్యమైంది. ఇప్పుడతడు నవ యువకుడిలా కనిపిస్తున్నాడు’ అని అన్నాడు.
చదవండి: CWC 2025: ఇంగ్లండ్ చేతిలో ఓటమి.. అయినా భార‌త్‌కు సెమీస్ ఛాన్స్‌! ఇలా జరగాల్సిందే? 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)