Breaking News

అతడిని భారత జట్టులోకి తీసుకోండి.. సరిగ్గా వాడుకుంటే అద్భుతాలు సృష్టిస్తాడు

Published on Mon, 05/15/2023 - 17:15

ఐపీఎల్‌-2023లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ రింకూ సింగ్‌ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఆదివారం చెపాక్‌ వేదికగా సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంలో రింకూ సింగ్‌ కీలక పాత్ర పోషించాడు. 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌ 33 పరుగులకే 3 వికెట్లు కష్టాల్లో పడింది.

ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన  రింకూ సింగ్, నితీశ్ రాణాతో కలిసి 99 పరగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో 43 బంతులు ఎదుర్కొన్న రింకూ.. 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 54 పరుగులు చేశాడు. ఇక​ఈ మెగా టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న రింకూపై కేకేఆర్‌ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ ప్రశంసల వర్షం కురిపించాడు. టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వడానికి రింకూకు అన్ని రకాల అర్హతలు ఉన్నాయి అని అభిషేక్ నాయర్ అభిప్రాయపడ్డాడు.

"రింకూ సింగ్‌ స్పిన్‌కు అద్భుతంగా ఆడతాడు. ఫస్ట్-క్లాస్ సీజన్, దేశవాళీ టోర్నీలో రింకూ మంచి రికార్డు ఉంది. గత మూడు నాలుగు సీజన్లలో బాగా రాణించిన ఆటగాళ్లలో రింకూ ఒకడు. దేశవాళీ క్రికెట్‌లో ఉత్తర్‌ప్రదేశ్‌కు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించాడు. దేశవాళీ క్రికెట్ అత్యం‍త కఠినమైన పిచ్‌లో లక్నో ఒకటి.

అటువంటి పిచ్‌పై కూడా రింకూ చాలా మంచి ఇన్నింగ్స్‌లు ఆడి ఉన్నాడు. అతడు బాగా కష్టపడతాడు. కాబట్టి రింకూ భారత జట్టు తరపున ఆడాలని నేను ఆశిస్తున్నాను. సరిగ్గా వాడుకుంటే రింకూ మూడు ఫార్మాట్లలో టీమిండియాకి మంచి ఫినిషర్‌గా మారతాడు అని మీడియా సమావేశంలో నాయర్‌ పేర్కొన్నాడు.
చదవండి: MS Dhoni: ధోనికి సీఎస్‌కే అంటే ప్రాణం! ఆ జట్టులో ఉన్నపుడు చెన్నై గురించి చెబుతూ ఉద్వేగానికి లోనయ్యేవాడు! ఈ దృశ్యాలు చూస్తుంటే!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)