Breaking News

యువరాజ్ ఒంటరి పోరాటం.. భారత్‌ను చిత్తు చేసిన అఫ్గాన్‌

Published on Thu, 11/20/2025 - 13:59

అఫ్గానిస్తాన్, భారత్‌-ఎ అండర్‌-19 మక్కోణపు వన్డే టోర్నీలో భారత్‌-బి జట్టు వరుసగా రెండో ఓటమి చవిచూసింది. బెంగళూరు వేదికగా జరిగిన  రెండో మ్యాచ్‌లో భారత్-బి జట్టును 71 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్ చిత్తు చేసింది. కేవలం 169 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక భారత్‌-బి జట్టు చతికలపడింది. అఫ్గాన్‌ బౌలర్ల దాటికి భారత్‌ 29.3 ఓవర్లలో కేవలం 97 పరుగులకే కుప్పకూలింది.

యువరాజ్ ఒంటరి పోరాటం
ఓపెనర్‌ యువరాజ్‌ గోహిల్‌ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. యువరాజ్‌ 80 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 60 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడికి ఇతరల నుంచి కనీస సపోర్ట్‌ లభించలేదు. అఫ్గాన్‌ పేసర్‌ అబ్దుల్ అజీజ్ 6 వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించాడు.

తన 10 ఓవర్ల కోటాలో కేవలం 38 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అందులో ఓ హ్యాట్రిక్‌ కూడా ఉంది. అతడితో పాటు సలీం ఖాన్‌, జద్రాన్‌ తలా రెండు వికెట్లు సాధించారు.

ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ యువ జ‌ట్టు ఇండియా బౌలర్లు చెలరేగడంతో 45.2 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటైంది. అఫ్గాన్‌ బ్యాటర్లలో ఫైసల్ షినోజాడా(58) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. అజీజుల్లా మియాఖిల్(42) ఫర్వాలేదన్పించారు.

మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అంతకుముందు ఇండియా-ఎతో జరిగిన మ్యాచ్‌లో కూడా జార్జ్ సారథ్యంలోని భారత్ ఓటమి పాలైంది.
చదవండి: IPL 2026: ‘పెంచి, పోషించి.. అతడిని ఎలా వదిలేశారు?’

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)