Breaking News

డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ.. ఫైనల్లో పాకిస్తాన్ చిత్తు

Published on Sun, 08/03/2025 - 07:39

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) 2025 టోర్నీ విజేత‌గా ద‌క్షిణాఫ్రికా ఛాంపియ‌న్స్ నిలిచింది. శ‌నివారం ఎడ్జ్‌బాస్ట‌న్ వేదిక‌గా జ‌రిగిన ఫైన‌ల్లో పాకిస్తాన్ ఛాంపియ‌న్స్‌ను చిత్తు చేసిన సౌతాఫ్రికా.. తొలి డ‌బ్ల్యూసీఎల్ టైటిల్‌ను ముద్దాడింది. ఈ విజ‌యంలో ప్రోటీస్ దిగ్గ‌జం, సౌతాఫ్రికా ఛాంపియ‌న్స్ కెప్టెన్ ఏబీ డివిలియ‌ర్స్‌ది కీల‌క పాత్ర‌.

47 బంతుల్లో సెంచరీ..
196 ప‌రుగుల ల‌క్ష్య చేధ‌న‌లో డివిలియ‌ర్స్ విధ్వంసక‌ర సెంచ‌రీతో చెల‌రేగాడు. ప్ర‌త్య‌ర్ది బౌల‌ర్ల‌ను ఊతికారేశాడు. ఎడ్జ్‌బాస్ట‌న్ మైదానంలో సిక్స‌ర్ల వ‌ర్షం కురిపించాడు. అత‌డిని ఔట్ చేయ‌డం పాక్ బౌల‌ర్ల త‌రం కాలేదు. కేవలం 47 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.

మొత్తంగా 60 బంతులు ఎదుర్కొన్న డివిలియర్స్‌.. 12 ఫోర్లు, 7 సిక్స్‌లతో 120 పరుగులు చేశాడు. అతడితో పాటు జేపీ డుమినీ(28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సి​క్స్‌లతో 50 నాటౌట్‌) హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. పాక్ బౌలర్లలో ఆజ్మల్ ఒక్కడే వికెట్ సాధించారు. మిగితా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు.

షర్జీల్ ఖాన్ మెరుపులు..
అంత‌కుముందు బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఛాంపియ‌న్స్ నిర్ణీత 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. పాక్‌ బ్యాటర్లలో షర్జీల్ ఖాన్ మెరుపులు మెరిపించాడు. కేవలం 44 బంతుల్లోనే 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 76 పరుగులు చేశాడు. అతడితో పాటు ఉమర్‌ అమీన్‌(36) రాణించాడు. సఫారీ బౌలర్లలో విల్జోయెన్, పార్నల్‌ తలా రెండు వికెట్లు సాధించారు. ఒక మెగా ఈవెంట్‌ ఆసాంతం అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన డివిలియర్స్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ది టోర్నీ అవార్డు దక్కింది.
చదవండి: యశస్వి జైస్వాల్‌ వరల్డ్‌ రికార్డు.. ప్రపంచంలోనే ఏకైక ప్లేయర్‌గా..


 

 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)