Breaking News

'రొనాల్డో, ఫెదరర్‌లానే కోహ్లి కూడా చాలా గొప్పోడు'

Published on Fri, 07/28/2023 - 17:00

టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి, దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌ ఐపీఎల్‌లో ఆర్‌సీబీకి పదేళ్ల పాటు కలిసి ఆడారు. ఆర్‌సీబీ టైటిల్‌ కొట్టడంలో విఫలమైనప్పటికి ఈ జోడి మాత్రం తమ ఆటతో అభిమానులను అలరించారు. డివిలియర్స్‌ ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించినా ఆర్‌సీబీని మాత్రం వదల్లేదు. ఐపీఎల్‌ సీజన్‌ ప్రారంభమైన ప్రతీసారి ఆర్‌సీబీకి ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ ఒక సందేశాన్ని విడుదల చేయడం మిస్టర్‌ 360కి అలవాటు.  పదేళ్ల పాటు ఒకే జట్టుకు కలిసి ఆడిన కోహ్లి, డివిలియర్స్‌లు మంచి మిత్రులన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

తాజాగా వెస్టిండీస్‌తో ముగిసిన రెండో టెస్టులో(కోహ్లికి 500వ అంతర్జాతీయ మ్యాచ్‌) సెంచరీతో మెరిసిన కోహ్లిపై ద‌క్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియ‌ర్స్ ప్ర‌శంస‌లు కురిపించాడు. కోహ్లీ ప్ర‌పంచంలోని గొప్ప క్రీడాకారుల్లో ఒక‌డ‌ని అత‌ను అన్నాడు. గెల‌వాల‌నే క‌సి.. ప్ర‌తిసారి స్కోర్ చేయాల‌నే ఆక‌లి గొప్ప ఆట‌గాళ్లలో క‌నిపించే ల‌క్షణాలని.. అవ‌న్నీ విరాట్‌లో పుష్క‌లంగా ఉన్నాయ‌ని డివిలియ‌ర్స్ తెలిపాడు.

''గోల్ఫ్ దిగ్గ‌జం టైగ‌ర్ వుడ్స్, ఫుట్‌బాల్ లెజెండ్స్‌ క్రిస్టియానో రొనాల్డో, లియోన‌ల్ మెస్సీ, టెన్నిస్ ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయ‌ర్లు రోజ‌ర్ ఫెద‌ర‌ర్, ర‌ఫెల్ నాద‌ల్, నొవాక్ జ‌కోవిచ్‌.. వీళ్లంతా గెల‌వాల‌నే క‌సితో ఆడ‌తారు. వీళ్ల‌లో పోరాట స్ఫూర్తి అమోఘం. పోటీ ఏదైనా ప్ర‌తిసారి చాంపియ‌న్ అవ్వాల‌నుకుంటారు. విరాట్ కోహ్లీ కూడా అచ్చం వీళ్ల‌లానే ప్ర‌వ‌ర్తిస్తాడు. అంతేకాదు అత‌డి హృదయం చాలా అంద‌మైన‌ది'' అని డివిలియ‌ర్స్ చెప్పుకొచ్చాడు.

ప‌దేళ్లు ఒకే జ‌ట్టుకు
మిస్ట‌ర్ 360 క్రికెట‌ర్‌గా డివిలియ‌ర్స్ అభిమానుల మ‌న‌సులో చిర‌స్థాయిగా నిలిచిపోయాడు. మెరుపు బ్యాటింగ్‌తో ప్ర‌త్య‌ర్థుల‌ను వ‌ణికించిన ఈ ద‌క్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ క్రికెట్‌పై చెర‌గ‌ని ముద్ర వేశాడు. 2018లో అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికిన అత‌ను ఆ త‌ర్వాత‌ ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో త‌న విధ్వంస‌క ఇన్నింగ్స్‌ల‌తో ఫ్యాన్స్‌ను అల‌రించాడు.

చదవండి: ICC T20 WC 2024: టి20 ప్రపంచకప్‌ 2024కు పపువా న్యూ గినియా అర్హత

Kuldeep Yadav: సంచలన స్పెల్‌! కానీ నీకే ఎందుకిలా? కుల్దీప్‌ యాదవ్‌ కామెంట్స్‌ వైరల్‌

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)