మెడ విరిగినా వెనక్కి తగ్గలేదు.. ఒలింపిక్ గోల్డ్‌ను ముద్దాడాడు!

Published on Fri, 07/31/2026 - 19:51

సంకల్పానికి, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచిపోయిన అథ్లెట్లలో అమెరికా రెజ్లర్ కర్ట్ ఆంగిల్ (Kurt Angle) ఒకరు. అయితే డబ్ల్యూడబ్ల్యూఎఫ్ రెజ్లర్‌గా విశేష ఆదరణ పొందిన కర్ట్ ఆంగిల్ జీవితం ఒక ఆదర్శం. డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌(WWF/WWE)లో చీటింగ్ ప్లేయర్‌గా పేరు పొందిన కర్ట్ ఆంగిల్‌, రెజ్లింగ్‌లో మాత్రం నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమని చెప్పొచ్చు. అందుకే డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌లో కొనసాగినంత కాలం మెడలో అట్లాంటా ఒలింపిక్స్‌లో సాధించిన గోల్డ్ మెడల్‌ను వేసుకునే వచ్చేవాడు కర్ట్ ఆంగిల్‌.

1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో కర్ట్ ఆంగిల్‌ సాధించిన స్వర్ణ పతకం కేవలం విజయం మాత్రమే కాదు.. అసాధారణ పోరాట స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనం. తీవ్రమైన మెడ గాయంతో బాధపడుతూనే బరిలోకి దిగి ప్రత్యర్థులను ఓడించి బంగారు పతకాన్ని సొంతం చేసుకున్న ఆయన కథ నేటికీ ప్రపంచ క్రీడా చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది.

అట్లాంటా ఒలింపిక్స్‌కు కొన్ని నెలల ముందు కర్ట్ ఆంగిల్‌కు మెడలో తీవ్ర గాయం అయింది. సర్వైకల్ వెన్నెముకలోని C6, C7 వెర్టీబ్రాల వద్ద గాయం కావడంతో వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. సాధారణంగా ఇలాంటి గాయంతో అథ్లెట్ కెరీర్‌కే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. కానీ ఒలింపిక్ స్వర్ణమే తన జీవిత లక్ష్యమని భావించిన కర్ట్‌ ఆంగిల్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. తీవ్ర నొప్పిని భరిస్తూనే ప్రత్యేకమైన చికిత్స, కఠిన సాధనతో తిరిగి పోటీలకు సిద్ధమయ్యాడు.

1996 జూలై 31న జరిగిన పురుషుల 100 కిలోల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఫైనల్లో కర్ట్ ఆంగిల్ ఇరాన్‌కు చెందిన అబ్బాస్ జదిదిని ఎదుర్కొన్నాడు. గాయం ప్రభావం ఉన్నప్పటికీ అసాధారణ పట్టుదలతో పోరాడి 1-0 తేడాతో విజయం సాధించాడు. ఆ విజయంతో ఒలింపిక్ స్వర్ణ పతకాన్ని అందుకున్నాడు. ఆ క్షణం ఆయన వ్యక్తిగత విజయమే కాదు.. పట్టుదల ముందు శారీరక బాధ కూడా ఓడిపోతుందనే సందేశంగా నిలిచిపోయింది.

ఆ తర్వాత కర్ట్ ఆంగిల్ ప్రొఫెషనల్ రెజ్లింగ్‌లోకి అడుగుపెట్టి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించాడు. WWEలో అనేక ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు గెలుచుకుని అత్యుత్తమ రెజ్లర్లలో ఒకరిగా గుర్తింపు పొందాడు. తన ప్రసంగాల్లో "I won an Olympic gold medal with a broken freaking neck" అనే వ్యాఖ్యతో ఆయన తన పోరాట గాథను ఎన్నోసార్లు గుర్తు చేశారు.

కర్ట్ ఆంగిల్ సాధించిన ఈ ఘనతకు నేటితో 30 ఏళ్లు పూర్తయ్యాయి. మూడు దశాబ్దాలు గడిచినా ఆయన విజయం ఇప్పటికీ అథ్లెట్లకు స్ఫూర్తిదాయకంగానే నిలిచింది. శరీరం ఎంత బలహీనపడినా, మనసు బలంగా ఉంటే అసాధ్యాన్ని కూడా సాధ్యం చేయవచ్చని కర్ట్ ఆంగిల్ తన జీవితంతో నిరూపించాడు. ఒలింపిక్ చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోవడానికి కారణం కేవలం గోల్డ్ మెడల్ కాదు.. ఆ స్వర్ణం వెనుక ఉన్న అచంచల సంకల్పం, అపారమైన ధైర్యమే. థాంక్యూ ఆల్‌ టైమ్‌ గ్రేట్‌.. క‌ర్ట్ ఆంగిల్‌.

 

 

చదవండి: కొత్త లుక్‌లో రోహిత్ శ‌ర్మ‌.. వ‌య‌సులో ప‌దేళ్లు వెన‌క్కి!

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)