కబడ్డీ ప్లేయర్‌ భార్య అనుమానాస్పద మృతి

Published on Sat, 08/01/2026 - 12:50

హర్యానాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కబడ్డీ ఆటగాడు షీలూ బల్హారా భార్య, 23 ఏళ్ల ముస్కాన్ శుక్రవారం మధ్యాహ్నం రోహ్‌తక్ జిల్లాలోని వారి నివాసంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

రోహ్‌తక్‌లోని మెహమ్ ప్రాంతానికి చెందిన ముస్కాన్ 2023 డిసెంబర్‌లో షీలూను వివాహం చేసుకుంది. ఈ దంపతులకు గతేడాది నవంబర్‌లో హార్దిక్ అనే కుమారుడు జన్మించాడు.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఫోరెన్సిక్ బృందాన్ని కూడా రంగంలోకి దించి ఆధారాలను సేకరించారు. ముస్కాన్ ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసుల విచారణలో భాగంగా ముస్కాన్ సోషల్ మీడియా కార్యకలాపాలను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఘటనకు ఒక్కరోజు ముందు ఆమె పంజాబీ పాటకు సంబంధించిన రీల్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి.

ముస్కాన్ మృతికి సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కారణం నిర్ధారించేందుకు కుటుంబ సభ్యుల వాంగ్మూలాలతో పాటు ఇతర ఆధారాలను కూడా పరిశీలిస్తున్నారు.

షీలూ బల్హారా కెరీర్‌ విషయానికొస్తే.. షీలూకు హర్యానాలో స్టార్‌  కబడ్డీ ప్లేయర్‌గా పేరుంది. డిఫెన్స్‌లో ‘క్యాచర్’గా అతడు మంచి గుర్తింపు కలిగి ఉన్నాడు. ఈ ఏడాది అతడిని ఓ స్థానిక టోర్నీలో “India’s leading catchers”లో ఒకరిగా ప్రముఖులు పేర్కొన్నారు.

 

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)