Breaking News

2007 కంటే ఈ వరల్డ్‌కప్ నాకెంతో స్పెషల్‌: రోహిత్‌ శర్మ

Published on Fri, 07/05/2024 - 17:54

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ ఛాంపియ‌న్స్ టీమిండియాకు తమ సొంత గడ్డపై ఘన స్వాగతం లభించింది. ముంబైలో వేలాది మంది అభిమానుల నీరాజనాల మధ్య భారత ఆటగాళ్ల బస్ విక్టరీ పరేడ్ అంగరంగవైభంగా జరిగింది.  ఆ తర్వాత  వాఖండే స్టేడియంలో విశ్వవిజేతలను బీసీసీఐ ఘనంగా సత్కరించింది.

ఈ వేడుకను తిలకించేందుకు భారీ సంఖ్యలో అభిమానులు స్టేడియంకు తరలిచ్చారు. టీమిండియా స్టేడియంలో అడుగుపెట్టగానే జయహో భారత్ అంటూ జేజేలు కొట్టారు. భారత ఆటగాళ్లు సైతం వారి అభిమానానికి పిధా అయిపోయారు.

దీంతో భారత ప్లేయర్లు డ్యాన్స్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరించారు. ఈ క్రమంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ కొన్ని ఆసక్తికర వాఖ్యలు చేశాడు. 2007 వరల్డ్‌కప్ విజయం కంటే ప్రస్తుత ప్రపంచకప్ గెలుపు తనకెంతో ప్రత్యేకమైనదని రోహిత్ తెలిపాడు.

"2007 వరల్డ్‌కప్ విజయాన్ని నేను ఎప్పటికి మర్చిపోలేను. ఎందుకంటే అది నా ఫస్ట్ వరల్డ్‌కప్ విజయం. అప్పుడు కూడా ఇదే ముంబైలో విక్టరీ పరేడ్ జరిగింది. ​అయితే అది మధ్యాహ్నం.. ఇప్పుడు ఇది సాయంత్రం. అయితే ఈసారి  వరల్డ్‌కప్ విజయం నాకెంతో ప్రత్యేకం. 

ఎందుకంటే విజేతగా నిలిచిన జట్టుకు నేను సారథిగా ఉన్నాను. నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. నాకు మాటలు కూడా రావడం లేదు. ఈ విజయం నా ఒక్కడికే కాదు ఎవత్ దేశానికి గర్వకారణం. 

ఈ ట్రోఫీ కోసమే గత 13 ఏళ్లగా అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 140 కోట్ల భారతీయుల కలనెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉందని" బీసీసీఐతో రోహిత్‌ పేర్కొన్నాడు.

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)