Breaking News

2024 ఐసీసీ అవార్డుల విజేతలు వీరే..!

Published on Tue, 01/28/2025 - 18:51

2024 ఐసీసీ అవార్డుల ప్రకటన ప్రక్రియ జనవరి 24న మొదలై, ఇవాల్టితో (జనవరి 28) ముగిసింది. మూడు ఫార్మాట్లలో పురుషులు, మహిళల విభాగాల్లో వ్యక్తిగత అవార్డులతో పాటు టీమ్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డులను రివీల్‌ చేశారు. గతేడాదికి సంబంధించి మొత్తం 12 వ్యక్తిగత అవార్డులు, 5 ఐదు టీమ్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డులు ప్రకటించబడ్డాయి.

వ్యక్తిగత విభాగాల్లో ఐసీసీ అవార్డులు (2024)..

  • ఐసీసీ మెన్స్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్ (సర్‌ గ్యారీ ఫీల్డ్‌ సోబర్స్‌ ట్రోఫీ)-జస్ప్రీత్‌ బుమ్రా (నామినీలు-హ్యారీ బ్రూక్‌, ట్రవిస్‌ హెడ్‌, జో రూట్‌)

  • ఐసీసీ వుమెన్స్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ (రేచల్‌ హెహోయ్‌ ఫ్లింట్‌ ట్రోఫీ)-మేలీ కెర్‌ (నామినీలు-చమారీ ఆటపట్టు, అన్నాబెల్‌ సదర్‌ల్యాండ్‌, లారా వోల్వార్డ్ట్‌)

  • ఐసీసీ మెన్స్‌ టెస్ట్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్-జస్ప్రీత్‌ బుమ్రా (నామినీలు-హ్యారీ బ్రూక్‌, కమిందు మెండిస్‌, జో రూట్‌)

  • ఐసీసీ వుమెన్స్‌ వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్-స్మృతి మంధన (నామినీలు-చమారీ ఆటపట్టు, అన్నాబెల్‌ సదర్‌ల్యాండ్‌, లారా వోల్వార్డ్ట్‌)

  • ఐసీసీ మెన్స్‌ వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌- అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ (నామినీలు- వనిందు హసరంగ, కుసాల్‌ మెండిస్‌, షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌)

  • ఐసీసీ ఎమర్జింగ్‌ వుమెన్స్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌-అన్నెరీ డెర్క్‌సెన్‌ (నామినీలు-సస్కియా హోర్లీ, శ్రేయాంక పాటిల్‌, ఫ్రేయా సర్జెంట్‌)

  • ఐసీసీ ఎమర్జింగ్‌ మెన్స్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌-కమిందు మెండిస్‌ (నామినీలు-సైమ్‌ అయూబ్‌, గస్‌ అట్కిన్సన్‌, షమార్‌ జోసఫ్‌)

  • ఐసీసీ వుమెన్స్‌ అసోసియేట్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌-ఈషా ఓఝా

  • ఐసీసీ మెన్స్‌ అసోసియేట్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌-గెర్హార్డ్‌ ఎరాస్మస్‌

  • ఐసీసీ అంపైర్‌ ఆఫ్‌ ద ఇయర్‌-రిచర్డ్‌ ఇల్లింగ్‌వర్త్‌

  • ఐసీసీ మెన్స్‌ టీ20 క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌-అర్షదీప్‌ సింగ్‌ (నామినీలు-బాబర్‌ ఆజమ్‌, ట్రవిస్‌ హెడ్‌, సికందర్‌ రజా)

  • ఐసీసీ వుమెన్స్‌ టీ20 క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌-మేలీ కెర​్‌ (నామినీలు- చమారీ ఆటపట్టు, ఓర్లా ప్రెండర్‌గాస్ట్‌, లారా వోల్వార్డ్ట్‌)

ఫార్మాట్ల వారీగా టీమ్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డులు..

ఐసీసీ మెన్స్‌ టీ20 టీమ్‌ ఆఫ్ ద ఇయర్ 2024: రోహిత్ శర్మ (కెప్టెన్‌), ట్రావిస్ హెడ్, ఫిల్ సాల్ట్, బాబర్ ఆజం, నికోలస్ పూరన్ (వికెట్‌కీపర్‌), సికందర్ రజా, హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, వనిందు హసరంగా, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.

ఐసీసీ వుమెన్స్‌ టీ20 టీమ్ ఆఫ్ ద ఇయర్ 2024: లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్‌), స్మృతి మంధాన, చమరి అతపత్తు, హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, మెలీ కెర్, రిచా ఘోష్ (వికెట్‌కీపర్‌), మరిజాన్ కప్ప్, ఓర్లా ప్రెండర్‌గాస్ట్, దీప్తి శర్మ, సదియా ఇక్బాల్‌.

ఐసీసీ మెన్స్‌ టెస్ట్ టీమ్‌ ఆఫ్ ద ఇయర్ 2024: యశస్వి జైస్వాల్, బెన్ డకెట్, కేన్ విలియమ్సన్, జో రూట్, హ్యారీ బ్రూక్, కమిందు మెండిస్, జామీ స్మిత్ (వికెట్‌కీపర్‌), రవీంద్ర జడేజా, పాట్ కమ్మిన్స్ (కెప్టెన్‌), మాట్ హెన్రీ, జస్ప్రీత్ బుమ్రా.

ఐసీసీ మెన్స్‌ వన్డే టీమ్‌ ఆఫ్ ద ఇయర్ 2024: సైమ్ అయూబ్, రహ్మానుల్లా గుర్బాజ్, పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (వికెట్‌కీపర్‌), చరిత్ అసలంక (కెప్టెన్‌), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, వనిందు హసరంగ, షాహీన్ షా అఫ్రిది, హరిస్ రౌఫ్, అల్లా ఘజన్‌ఫర్.

ఐసీసీ వుమెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ 2024: స్మృతి మంధాన, లారా వోల్వార్డ్ (కెప్టెన్‌), చమర్తి అథపత్తు, హేలీ మాథ్యూస్, మారిజాన్ కాప్, ఆష్లీ గార్డనర్, అన్నాబెల్ సదర్లాండ్, అమీ జోన్స్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్, కేట్ క్రాస్.

 

 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)