వన్డే ప్రపంచకప్‌తో భారత్‌కు రూ.11, 637 కోట్ల ఆదాయం..

Published on Thu, 09/12/2024 - 08:46

దుబాయ్‌: గతేడాది నిర్వహించిన వన్డే ప్రపంచకప్‌ భారత దేశానికి గణనీయమైన ఆర్ధిక లబ్ధిని చేకూర్చిందని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మెగా ఈవెంట్‌ ఆర్థికంగా పెద్ద ప్రభావమే చూపిందని, విదేశీ పర్యాటకులతో భారత్‌లోని ఆతిథ్య రంగం పెద్ద ఎత్తున లాభపడిందని అందులో వివరించింది.

గత అక్టోబర్, నవంబర్‌లో జరిగిన ఈ మెగా టోర్నీలో భారత్‌ రన్నరప్‌గా నిలిచింది. ‘ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్‌ క్రికెట్‌కు ఉన్న ఆర్ధిక శక్తి ఎలాంటిదో నిరూపించింది. ఆతిథ్య భారత్‌ 1.39 బిలియన్‌ అమెరికా డాలర్ల (రూ.11, 637 కోట్లు) ఆదాయం ఆర్జించేలా చేసింది.

ఈ వరల్డ్‌కప్‌ను చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు భారత్‌కు పోటెత్తారు. ఇలా పర్యాటకుల రాకతో ఆతిథ్య నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో హోటల్స్, భోజనం, వసతి, రవాణ, ఆహార పదార్థాలు, పానీయాల విక్రయంతో కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది’ అని ఐసీసీ ఆ నివేదికలో పేర్కొంది. 

టోర్నీ జరిగింత కాలం కొనుగోలు శక్తి పెరిగిందని, టికెట్ల రూపంలోనూ భారీ ఆదాయం వచి్చందని, ఏకంగా 12.50 లక్షల మంది ప్రేక్షకులు క్రికెట్‌ మ్యాచ్‌ల్ని చూసేందుకు ఎగబడ్డారని అందులో తెలిపింది.

ఐసీసీ ప్రపంచకప్‌ల చరిత్రలోనే ఇది ఘననీయమైన వృద్ధని, సగటున 75 శాతం ప్రేక్షకుల హాజరు నమోదు కావడం ఇదే తొలిసారని ఐసీసీ తెలిపింది. పర్యాటకులు, దేశీ ప్రేక్షకులకు సేవలందించడం ద్వారా 48 వేల మంది ఫుల్‌ టైమ్, పార్ట్‌ టైమ్‌ ఉద్యోగాలతో ఉపాధి పొందారని ఐసీసీ వివరించింది.
చదవండి: AUS vs ENG: హెడ్ విధ్వంసం.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన ఆసీస్‌

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)