Breaking News

స్పెయిన్‌ 20.. అర్జెంటీనా 0: తెర వెనుక హీరో అతడే!

Published on Mon, 07/20/2026 - 11:30

స్పెయిన్‌.. 2008- 2021 మధ్య ఫుట్‌బాల్‌ ప్రపంచాన్ని ఏలడమే కాదు. ఆట తీరును కూడా మార్చివేసింది. 1988- 96 మధ్య బార్సిలోనా జట్టు ప్రాచుర్యంలోకి తెచ్చిన ‘టికీ-టాకా’ అస్త్రాన్ని పూర్తిగా వాడుకోవడంలో స్పెయిన్‌ సఫలమైంది.

ఇందులో భాగంగా షార్ట్‌, క్విక్‌ పాసులతో పాదరసంలా కదులుతూ ఆటగాళ్లు ఎక్కువసేపు బంతిని తమ ఆధీనంలోనే ఉంచుకుంటూ.. ప్రత్యర్థిని పూర్తిగా అలసిపోయేలా చేస్తారు. ఆ తర్వాత గోల్స్‌ వేట మొదలుపెడతారు.

చిన్న, వేగవంతమైన పాసులతో బంతిని కదిలించడం.. నిర్దిష్ట జోన్లలో నిలిచి ఎల్లప్పుడూ పాసింగ్‌ ఆప్షన్లు కల్పించడం, ఆటగాళ్లు త్రిభుజాకారంలో నిలిచి తక్కువ దూరంలోనే బంతిని పాస్‌ చేసుకోవడం ఇందులోని ముఖ్య వ్యూహాలు.

ఆ తర్వాత అందుకే విఫలం
యూరో 2008, ఫిఫా వరల్డ్‌కప్‌-2010, యూరో 2012 టైటిళ్లను స్పెయిన్‌ టికీ-టాకా వ్యూహంతోనే దక్కించుకుంది. తమ ప్రత్యేక శైలితో ఆట తీరును మరో స్థాయికి తీసుకువెళ్లిన స్పెయిన్‌.. ఆ తర్వాత ప్రత్యర్థుల చేతిలో భంగపడింది. 

ఎల్లప్పుడూ ఎక్కువగా పాస్‌లపైనే దృష్టి పెట్టి గోల్స్‌ కొట్టడంలో విఫలమై 2018, 2022 వరల్డ్‌కప్‌ టోర్నీ నుంచి నిరాశగా వెనుదిరిగింది. ప్రత్యర్థి జట్లు తమ డిఫెన్స్‌ను మరింత బలోపేతం చేసుకుని స్పెయిన్‌ వ్యూహానికి ఇలా చెక్‌ పెట్టాయి.

ఫూయెంటె రాకతో..
దీంతో ఒకప్పుడు బలంగా భావించిన ‘టికీ- టాకా’ అస్త్రం.. ఆ తర్వాత ప్రత్యర్థుల అప్రమత్తతో వారి బలహీనతగా మారిపోయింది. అయితే, లూయీస్‌ డి లా ఫూయెంటె (Luis de la Fuente) స్పెయిన్‌ కోచ్‌గా వచ్చిన తర్వాత మరోసారి ఈ వ్యూహాన్ని బలోపేతం చేసే దిశగా కసరత్తు చేశాడు. సరికొత్త హంగులతో టికీ-టాకా 2.0ను తీసుకువచ్చాడు.

ఇందులో భాగంగా కేవలం బంతిని నియంత్రణలో ఉంచుకోవడమే కాకుండా.. వేగంగా ఫార్వర్డ్‌ చేసి గోల్స్ సాధించే శక్తివంతమైన జట్టుగా మారింది స్పెయిన్‌. కేవలం బంతిని పాస్‌ చేయడమే కాకుండా.. ప్రత్యర్థి మోహరింపుల్లోని గ్యాప్‌లను గుర్తించి అటాక్‌ చేయడంపై దృష్టి పెట్టింది. ఇందుకోసం లమీన్‌ యమాల్‌, విలియమ్స్‌ వంటి యువ ఆటగాళ్ల సేవలను వాడుకుంది.

తద్వారా కేవలం బంతిని కంట్రోల్‌ చేయడమే కాకుండా.. కౌంటర్‌ అటాక్‌లు చేయడంలో సఫలమై.. తమ అమ్ములపొదిలోని టికీ-టాకా అస్త్రానికి మరింత పదునుపెట్టింది. ముఖ్యంగా సెమీ ఫైనల్లో ఫ్రాన్స్‌పై  ఈ వ్యూహాన్ని సమర్థవంతంగా ఉపయోగించి అనుకున్న ఫలితాన్ని రాబట్టింది స్పెయిన్‌. ఆ మ్యాచ్లో పెడ్రో పోరో సాధించిన గోల్‌ ఆధునిక టికీ-టాకా వ్యూహానికి నిదర్శనం.

స్పెయిన్‌ 20.. అర్జెంటీనా 0
ఈ టోర్నీలో స్పెయిన్‌ మొత్తంగా పద్నాలుగు గోల్స్‌ సాధించగా.. ప్రత్యర్థి ఒకే ఒక గోల్‌ కొట్టే అవకాశం ఇచ్చింది. దీనిని బట్టి స్పెయిన్‌ సత్తా ఏమిటో అర్థం చేసుకోవచ్చు. 

ఇక వరల్డ్‌కప్‌-2026 ఫైనల్లో స్పెయిన్‌ గోల్‌ కోసం ప్రయత్నించే క్రమంలో 20 షాట్లు కొట్టింది. ఇందులో 12 గోల్‌ పోస్ట్‌ దిశగా వెళ్లాయి. మొత్తంగా 817 పాస్‌లు ఇచ్చుకున్నారు ఆటగాళ్లు. అదే సమయంలో అర్జెంటీనా మాత్రం గోల్‌ పోస్ట్‌ దిశగా ఒక్క షాట్‌ కూడా కొట్టలేకపోయింది. 

రోడ్రి వరల్డ్‌ రికార్డు
ఇక మైదానంలో పక్కాగా వ్యూహాలను అమలు చేసిన స్పెయిన​ సారథి రోడ్రి.. ఈ సీజన్లో ఏకంగా 790 పాస్‌లు ఇచ్చాడు. తద్వారా ప్రపంచకప్‌ చరిత్రలోనే అత్యధిక పాస్‌లు ఇచ్చిన ఆటగాడిగా తన పేరిట ఉన్న రికార్డును తానే బద్దలు కొట్టాడు. ఇక స్పెయిన్‌ డిఫెండర్లు క్యూబార్సి 668, లాఫోర్టే 618 పాసులు చేశారు. ఓవరాల్‌గా జట్టుగా స్పెయిన్‌ 4945 సార్లు బంతిని పాస్‌ చేసింది.

 తెర వెనుక హీరో అతడే!
దీనిని బట్టి స్పెయిన్‌ ఈ మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం కనబరిచిందన్న విషయం సుస్పష్టం. ఏదేమైనా ఫూయెంటె టికా-టాకాకు పునర్వైభవం తెచ్చి జట్టు రెండోసారి వరల్డ్‌కప్‌ ట్రోఫీ గెలిచేలా చేశాడు. తెర ముందు గోల్‌ కొట్టి ఫెరాన్‌ టోరెస్‌ హీరో కాగా.. తెర వెనుక తన పదునైన వ్యూహాలతో ఫూయెంటె హీరోగా నిలిచాడు.

చదవండి: మెస్సీ చేయలేనిది... రొనాల్డో సాధించాడు!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)