Breaking News

హ్యాట్రిక్‌ వికెట్లతో చెలరేగిన ఆస్ట్రేలియా ఫుట్‌బాలర్‌

Published on Tue, 11/18/2025 - 18:14

మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌-2025లో సంచలనం నమోదైంది. 16 ఏళ్ల సిడ్నీ సిక్సర్స్ ఆల్‌రౌండర్ కావిమ్ బ్రే (Caoimhe Bray) హ్యాట్రిక్‌ నమోదు చేసింది. తద్వారా WBBLలో హ్యాట్రిక్‌ సాధించిన అతి పిన్నవయస్కురాలిగా రికార్డు నెలకొల్పింది. 

కావిమ్‌కు ముందు WBBLలో ఆరుగురు (నికోల్ బోల్టన్, గెమ్మ ట్రిస్కారి, అమీ సాటర్త్‌వైట్, డేన్ వాన్ నీకెర్క్, మారిజాన్ కాప్, డార్సీ బ్రౌన్) హ్యాట్రిక్‌ సాధించారు. సిడ్నీ థండర్‌తో జరిగిన మ్యాచ్‌లో కావిమ్‌ ఈ ఘనత సాధించింది. కావిమ్‌ హ్యాట్రిక్‌ సహా నాలుగు వికెట్లతో చెలరేగడంతో థండర్‌పై సిక్సర్స్‌ 24 పరుగుల తేడాతో గెలుపొందింది.

అత్యంత అరుదైన ప్లేయర్‌గా కావిమ్‌
ఇక్కడి వరకు అంతా బాగుంది. క్రికెట్‌లో చాలామంది బౌలర్లు హ్యాట్రిక్‌ సాధిస్తుంటారు. అయితే కావిమ్‌కు మాత్రం ఓ ప్రత్యేకత ఉంది. ఈ అమ్మాయి క్రికెట్‌తో పాటు ఫుట్‌బాల్‌లో కూడా ప్రావీణ్యం ఉంది. ఆస్ట్రేలియా అండర్‌-17 ఫుట్‌బాల్‌ జట్టులో ఆమె గోల్‌కీపర్‌గా రాణిస్తుంది. తద్వారా క్రికెట్‌తో పాటు మరో క్రీడలో సత్తా చాటుతున్న అరుదైన ప్లేయర్ల జాబితాలో చేరింది.

కావిమ్‌ గాయం కారణంగా ఫుట్‌బాల్‌కు స్వల్ప విరామం ప్రకటించి, క్రికెట్‌వైపు మళ్లింది. ఈ క్రమంలో ఆమెకు సిడ్నీ సిక్సర్స్‌ నుంచి ఆహ్వానం అందింది. ఈ ఫ్రాంచైజీతో కావిమ్‌ మూడేళ్ల ఒప్పందంలో ఉంది. గత సీజన్‌లో బీబీఎల్‌ ఎంట్రీ ఇచ్చిని కావిమ్‌.. ఇప్పటివరకు 21 మ్యాచ్‌లు ఆడి, హ్యాట్రిక్‌ సహా 27 వికెట్లు తీసింది. బ్యాటింగ్‌లో 137 పరుగులు చేసింది. 

ఈ ఎడిషన్‌ బీబీఎల్‌లో సిడ్నీ సిక్స‍ర్స్‌ ప్రస్థానం ముగిసిన వెంటనే కావిమ్‌ మళ్లీ ఫుట్‌బాల్‌లోకి ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. ఆసీస్‌ మహిళ-ఏ లీగ్‌ టోర్నీలో న్యూకాసిల్‌ జట్టుకు గోల్‌కీపర్‌గా వ్యవహరించాల్సి ఉంది.

ప్రస్తుత ఆసీస్‌ జట్టులోని ఎల్లిస్‌ పెర్రీ కూడా ద్వంద క్రీడల్లో సత్తా చాటిన విషయం తెలిసిందే. పెర్రీ 17 ఏళ్లకే ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసి, క్రికెట్‌తో పాటు ఫుట్‌బాల్‌లోనూ దేశానికి ప్రాతినిథ్యం వహించింది. 

2011 FIFA Women’s World Cupలో పెర్రీ ఆస్ట్రేలియా తరఫున బరిలోకి దిగింది. ICC & FIFA వరల్డ్ కప్‌లలో పాల్గొన్న ఏకైక ఆస్ట్రేలియన్ మహిళగా పెర్రీ చరిత్ర సృష్టించింది. పెర్రీని ఆదర్శంగా తీసుకున్న కావిమ్‌ కూడా క్రికెట్‌, ఫుట్‌బాల్‌లో జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాలని ఉవ్విళ్లూరుతుంది. 

చదవండి: పాకిస్తాన్‌ ట్రై సిరీస్‌.. శ్రీలంక జట్టులో సరికొత్త స్పిన్‌ ఆయుధం

Videos

CBI ఎంక్వైరీ వేయండి... నీకు మంత్రిగా ఉండే అర్హత లేదు రాజీనామా చేయ్

సాక్షి అకౌంట్ల బ్లాక్ పై సీనియర్ జర్నలిస్టులు సీరియస్

ప్రభుత్వమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గగ్గోలు

తమ్ముడి సర్టిఫికెట్లు పెట్టిన అన్నకు టీచర్ ఉద్యోగం.. నిజం ఒప్పుకున్న పెద అప్పల్రాజు

బయటపడ్డ లోకేష్ DSC అక్రమాల పుట్ట బాబు వెన్నులో వణుకు...

వైభవ్ పై BCCI ప్రత్యేక నిఘా

ఎవరు మంత్రి కావాలి..? ఎవరి మాట వినాలి?

సాక్ష్యాలతో వస్తాం .. సిద్ధంగా ఉండు..! లోకేష్ కు YSRCP ఎమ్మెల్సీ సవాల్

కూటమిలో లోకల్ వార్.. బాబుకు జనసేన, బీజేపీ హెచ్చరిక

ఎక్కడ దాక్కున్నావ్ లోకేష్.. కొండారెడ్డి బురుజుకు ఇప్పుడురా..

Photos

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!