Breaking News

భార్యతో గొడవ.. కోపంతో ఆమె చేతి వేళ్లను కొరికి తినేసిన భర్త

Published on Fri, 08/04/2023 - 16:21

బెంగళూరు: దంపతుల మధ్య గొడవలు సహజం. ఇలాంటివి వచ్చినప్పుడు తప్పు ఎక్కడ జరిగిందని సమీక్షించుకుని సమస్యను పరిష్కరించుకోవాలి తప్పు .. గొడవలను పెద్దవి చేసుకోకూడదని పెద్దలు అంటుంటారు. అయితే ఇటీవల కొందరు భార్యాభర్తలు హత్యలకు కూడా కారణం అవుతున్నాయి. క్షణికావేశం కొంపల్ని వాళ్ల జీవితాలని నాశనం చేస్తున్నాయి. తాజాగా భార్యతో గొడవపడిన భర్త.. ఆమె వేలిని కొరికి ఉమ్మేశాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే.. విజయ్ కుమార్ స్వస్థలం కర్ణాటకలోని బెంగళూరు. అతని భార్య పేరు పుష్ప. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. పెళ్లయి 23 ఏళ్లు కావస్తున్న వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో వారిద్దరూ అభిప్రాయ బేధాల కారణంగా విడిపోయి విడివిడిగా జీవిస్తున్నారు. విజయ్ కుమార్ తన కుమారుడితో కలిసి ఉంటున్నాడు. 

కొన్నేళ్ల నుంచి విజయ్‌కుమార్‌ భార్యను వేధిస్తుండటంతో ఆమె వేరుగా ఉంటోంది. గత నెల 28న విజయ్‌కుమార్‌ ఆమె వద్దకు వెళ్లి ఘర్షణకు దిగాడు. కోపం పట్టలేక ఆమెపై దాడి చేసి ఎడమ చేతి వేళ్లు కొరికి తినేశాడు. తన వద్దకు రాకపోతే ఆమెను చంపి ఇదే విధంగా తినేస్తానని బెదిరించడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు విజయ్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: నిందితులను పట్టుకున్నారు.. చివరికి కక్కుర్తి పడి పోలీసులే అరెస్టయ్యారు!

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)