కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్
Breaking News
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్!
వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే టార్గెట్.. ప్రభుత్వ పెద్దల కుట్ర!
పాక్కు జై కొట్టిన బీజేపీ చీఫ్.. దేశ రాజకీయాల్లో కలకలం!
అమెరికాలో కాల్పుల కలకలం.. చిన్నారులు, టీచర్ మృతి
తిరంగా మార్చ్: అభిజీత్ దీప్కే సంచలన ఆరోపణలు
జియో రీఛార్జ్ ధరలు పెరుగుతాయా? ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు
మంత్రి కొల్లు ఇంటి ముందు వైఎస్సార్‌సీపీ మహిళా నేతల నిరసన
Published on Thu, 07/17/2025 - 16:01
సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర ఇంటి ముందు వైఎస్సార్‌సీపీ మహిళా నేతలు నిరసనకు దిగారు. జడ్పీ ఛైర్ పర్సన్ ఉప్పాల హారికపై మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలపై మండిపడ్డారు. చీపుర్లతో కొల్లు రవీంద్ర ఫోటోలను కొడుతూ నిరసన వ్యక్తం చేశారు. ఉప్పాల హారికకు కొల్లురవీంద్ర క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీ ద్రోహి కొల్లు రవీంద్ర అంటూ నినాదాలు చేశారు.

మహానటి కంటే ఎక్కువ అంటే మీ ఇంట్లోవాళ్లేనా?. మీ ఇంట్లో ఆడవాళ్ల గురించైతే ఇలానే మాట్లాడతారా? అంటూ నిలదీశారు. ఉప్పాల హారిక భర్త రాముపై కేసు పెట్టడం దుర్మార్గం. తక్షణమే మంత్రి కొల్లు రవీంద్ర క్షమాపణ చెప్పాలి. ఉప్పాల హారికకు క్షమాపణ చెప్పేవరకూ మా పోరాటం ఆగదు’’ వైఎస్సార్‌సీపీ మహిళా నేతలు హెచ్చరించారు.

#
Tags : 1