Breaking News

ఏపీలో మహిళల భద్రత గాల్లో దీపం.. ఎన్‌హెచ్‌ఆర్‌సీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు

Published on Tue, 10/29/2024 - 15:21

సాక్షి, ఢిల్లీ: జాతీయ మానవ హక్కుల సంఘం యాక్టింగ్ చైర్‌పర్సన్‌ విజయభారతిని వైఎస్సార్‌సీపీ మహిళా నేతల బృందం మంగళవారం కలిసింది. ఏపీలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేశారు. మహిళా నేతల బృందంలో వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, ఎంపీ డాక్టరు తనుజారాణి, మాజీ ఎంపీలు చింత అనురాధ, మాధవి ఉన్నారు.

కూటమి ప్రభుత్వంలో 77 మంది మహిళలపై లైంగికదాడులు, హత్యలు జరిగిన విషయాన్ని కమిషన్ దృష్టికి వైఎస్సార్‌సీపీ తీసుకెళ్లింది. వరుసగా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్న చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్రమ మద్యం, అక్రమ ఇసుక దందాల్లో  సీఎం హోంమంత్రి బీజీగా ఉన్నారని.. మహిళల రక్షణ కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తెచ్చిన దిశా యాప్‌ను నిరుపయోగం చేశారని ఫిర్యాదులో వెల్లడించారు.

దిశా యాప్ నిర్వీర్యం చేయడంతో  మహిళల భద్రత గాల్లో దీపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఈ అంశాల్లో వెంటనే జోక్యం చేసుకోవాలని మానవ హక్కుల సంఘానికి  విజ్ఞప్తి చేశారు. మహిళల భద్రతకు తగిన చర్యలు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని వైఎస్సార్‌సీపీ నేతలు విన్నవించారు.

ఏపీలో మహిళల భద్రత గాల్లో దీపం..

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)