Breaking News

YSRCP Poru bata: విశాఖ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత

Published on Fri, 12/13/2024 - 11:55

విశాఖపట్నం, సాక్షి: కూటమి సర్కార్‌పై పోరుబాటలో భాగంగా.. ఇవాళ అన్నదాతకు అండగా కార్యక్రమం నిర్వహిస్తోంది వైఎస్సార్‌సీపీ. ఈ క్రమంలో రాష్ట్రమంతా కలెక్టరేట్‌ల వద్ద నిరసన కార్యక్రమాలకు పిలుపు ఇచ్చింది. అయితే.. కలెక్టరేట్‌ వద్ద జరిగిన కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

విశాఖ కలెక్టరేట్‌ వద్దకు వైఎస్సార్‌సీపీ నేతలతో పాటు భారీగా రైతులు చేరుకున్నారు. అయితే లోపలికి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో తోపులాట జరగ్గా.. మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య గాయపడ్డారు. ఆయన చేతికి గాయమైనట్లు తెలుస్తోంది.

మరోవైపు.. జిల్లా పరిషత్‌ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ దాకా వైఎస్సార్‌సీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ క్రమంలో డీఆర్‌ఓకు వినతిపత్రం సమర్పించారు ఆ పార్టీ నేతలు. ‘‘ ప్రజల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుంది. రైతాంగ సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లకు వినతి పత్రం సమర్పించాం.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతున్న రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. తక్షణమే.. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి.

.. సూపర్ సిక్స్ అని చెప్పి కూటమి ప్రభుత్వం డక్ ఔట్ అయింది. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఏడాదికి రూ.20,000 ఇవ్వాల్సిందే. 
రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. ఇరవై లక్షల మంది నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. 18 ఏళ్ల నిండిన మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ హామీలన్నీ నెరవేర్చాల్సిందే అని గుడివాడ అన్నారు.

సూపర్ సిక్స్ హామీలతో కూటమి డకౌట్

Videos

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)