Breaking News

‘నూటికి నూరు శాతం ఇవి ఎన్నికలు కావు’

Published on Sun, 11/01/2026 - 19:11

తాడేపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఈరోజు(ఆదివారం, నవంబర్‌ 1వ తేదీ) పులివెందులలో జరిగిన పోలింగ్‌ తీరుపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ సజ్జల  రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. నూటికి నూరు శాతం ఇవి ఎన్నికలు కావని మండిపడ్డారు. పోలీసులు, ఎన్నికల అధికారుల సమక్షంలోనే దాడులు జరిగితే.. వీటిని ఏమంటారని ప్రశ్నించారు సజ్జల.  నామినేషన్లు వేయకుండా అడ్డుకున్న తీరు.. ఇప్పుడు పోలింగ్‌ రోజున ఓటు వేయకుండా అడ్డుకున్న కోణాన్ని పరిశీలిస్తే దీనిని అరాచకం కాక ఇంకేమంటారని నిలదీశారు. 

తాడేపల్లి నుంచి మాట్లాడిన సజ్జల.. ‘అన్ని చోట్లా టీడీపీ గూండాల రిగ్గింగ్‌ చేశారు.. దానికి పోలీసులు సహకరించారు. పోలింగ్‌ కేంద్రాలను క్యాప్చర్‌ చేసి పచ్చమూకల రిగ్గింగ్‌ చేశారు. దుర్మార్గాలను అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు, నేతలపై దాడులు చేశారు. అధికారంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నిస్సహాయ స్థితిలో నెట్టేశారు.  చివరికి గంజాయి కేసులు కూడా పెట్టారు. పూర్తి ఆధారాలు ఉన్నా, స్క్రూటినీలో అభ్యర్థిత్వాన్ని తిరస్కరించారు. ఇలాంటి ఎన్నికలు జరగడం చరిత్రలో ఇదే మొదటిసారి. 

చంద్రబాబు పోలీసులతో బలప్రయోగం చేశారు..
పోలింగ్‌ కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను కూర్చోనివ్వకుండా చేశారు. పోలింగ్‌ కేంద్రాల్లో టీడీపీ నేతలు రిగ్గింగ్‌ చేశారు. చంద్రబాబు పెద్ద నాటకానికి తెరలేపారు. ప్రజల తీర్పును ఎదుర్కొనే దమ్ము చంద్రబాబుకు లేదు. చంద్రబాబు పోలీసులతో బలప్రయోగం చేశారు. పోలీసుల అండతో  దొంగ ఓట్లు వేయించారు. ఎన్నికలు ఎదుర్కొనే దమ్ము లేక చంద్రబాబు కుట్రలు అమలు చేశారు. టీడీపీ నేతలు, పోలీసులు, ఎస్‌ఈసీ కలిసి కుట్రను రక్తికట్టించాయి.

ఓటమి భయంతోనే చంద్రబాబు వ్యవస్థలను దిగజార్చారు. పులివెందులకు బయట నుంచి దొంగ ఓటర్లను తీసుకొచ్చారు. అసలైన పులివెందుల ప్రజలను ఓటేసేందుకు అనుమతివ్వలేదు.  గెలిచామని చెప్పుకునేందుకు చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారు. రేపు కౌంటింగ్‌లో కూడా ఇలానే వ్యవహరించినా ఆశ్చర్యం లేదు. సీసీ ఫుటేజ్‌ను ఎస్‌ఈసీ తెప్పించి ఎందుకు పరిశీలించడం లేదు’ అని ప్రశ్నించారు. 

టీడీపీ దౌర్జన్యాలను జాతీయ స్థాయికి తీసుకెళ్తాం..
టీడీపీ దౌర్జన్యాలను జాతీయ స్థాయికి తీసుకెళ్తామని హెచ్చరించారు. టీడీపీ నేతలను నడిరోడ్డ మీద నిలబెడతామన్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై టీడీపీ వాళ్లు, పోలీసులు దాడులు చేశారు. దాడులు చేసిన వారి పేర్లతో ఆధారాలు ఇచ్చినా చర్యలు తీసుకోలేదు. అంతా బాగుందనే యత్నం చేస్తున్నారు. టీడీపీ నేతలతో పోలీసులు  కుమ్మక్కయ్యారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 ఇదీ చదవండి:  ఎన్నికల చరిత్రలో చీకటిరోజు

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)