Breaking News

గుడ్లవల్లేరు ఘటన.. విద్యార్థుల మాన ప్రాణాలతో ఆటలా?: శివశంకర్‌

Published on Fri, 08/30/2024 - 13:11

సాక్షి, గుంటూరు: గుడ్లవల్లేరు ఘటనపై ప్రభుత్వ ఘోర వైఫల్యం కనిపించిందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ మండిపడ్డారు. వాష్ రూముల్లో కెమెరాలు పెట్టినట్టు విద్యార్థినులు గుర్తించి ఫిర్యాదు చేసినా కాలేజీ యాజమాన్యం ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు.

‘‘పోలీసులు వెంటనే స్పందించలేదు. లక్షలాది రూపాయలు ఫీజులు తీసుకుని విద్యార్థినుల మానంతో ఆటలాడుకుంటారా?. అనేక ఐఐటీల్లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెయ్యి మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయితే నో పోలీస్. గుడ్లవల్లేరులో రాత్రి నుంచి విద్యార్థినులు ఆందోళన చేస్తుంటే నో పోలీస్. గుడ్లవల్లేరు వెళ్లటానికి హోంమంత్రికి తీరిక లేదా?. సకల శాఖా మంత్రి లోకేష్ ఏం చేస్తున్నారు?’’ అంటూ శివశంకర్‌ ప్రశ్నించారు.

‘‘విద్యార్థులను వేధించిన విజయ్ అనే యువకుడు జనసేన పార్టీ. అతని సోషల్ మీడియా పోస్టులు అన్నీ అవే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యావ్యవస్థ నాశనం అయింది. విద్యార్థుల మాన, ప్రాణాలను కాపాడాలి. పోలీసు విచారణ జరిపిస్తామని ప్రభుత్వం ప్రకటన చేసింది. తర్వాత రెండు నిమిషాలకే కెమెరాలు లేవని పోలీసులు ఎలా ప్రకటించారు?. రెండు నిమిషాల్లోనే విచారణ పూర్తి చేశారా?. విద్యార్థినుల ఆందోళన కనపడటం లేదా?. వెంటనే కాలేజీని మూసేసి పూర్తి స్థాయి విచారణ జరపాలి’’ అని శివశంకర్‌ డిమాండ్‌ చేశారు.

Videos

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)