కాంగ్రెస్‌ ముసుగులో షర్మిలను తీసుకొచ్చిన బాబు

Published on Sun, 01/28/2024 - 04:15

సాక్షి, తిరుపతి: సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పాలనలో తుడిచి కొట్టుకు పోతామన్న భయాందోళనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కాంగ్రెస్‌ ముసుగులో షర్మిలమ్మను తీసుకొచ్చి అడ్డగోలు ఆరోపణలు చేయిస్తున్నారని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. అందుకే చంద్రబాబు అండ్‌కో, ఎల్లోమీడియా స్క్రిప్ట్‌ ప్రకారమే ఆమె విమర్శలు చేస్తున్నారని, వాటిని ప్రజలు పట్టించుకోవడం లేదని స్పష్టం చేశారు. తిరుపతిలోని పీఎల్‌ఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో శనివారం మంత్రి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త, తిరుపతి ఎంపీ గురుమూర్తి అధ్యక్షతన ఆత్మీయ సమ్మేళనం జరిగింది.

ఈ సందర్భంగా ‘సిద్ధం’ పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు. అంతకుముందు మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ‘చంద్రబాబుకే గ్యారెంటీ లేదు.. ఆయన  హామీలకు ఉంటుందా? బాబు హామీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు’ అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు ఓటమి తప్పదని, అందుకే కుప్పంతోపాటు మరో నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తారని వెల్లడించారు. రాష్ట్రంలో కమ్యూ­నిస్టుల జాడే లేకుండా పోయిందన్నారు.

సామాన్యులే సీఎం వైఎస్‌ జగన్‌కు ఎన్నికల స్టార్‌ క్యాంపెయినర్లని ధీమా వ్యక్తం చేశారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి, 2014లో అధికారంలోకి రాగానే 2 లక్షల మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులను తొలగించిన ఘనత చంద్రబాబుదన్నారు. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చారని, డ్వాక్రా మహిళల కోసం ఆసరా పథకాన్ని తీసుకొచ్చారని వివరించారు.

గతంలో జన్మభూమి కమిటీలు సిఫారసు చేస్తేనే సంక్షేమ పథకాలు అందేవని,  ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని, గడప గడపకు వెళ్లి వలంటీర్లు అర్హులందరికీ అందిస్తున్నారని చెప్పారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఫిబ్రవరి 3న అనంతపురంలో ‘సిద్ధం’ కార్యక్రమంలో పాల్గొంటారని, ఇందుకు సంబంధించిన సన్నాహక సమావేశం ఈ నెల 29న తిరుపతిలో నిర్వహించనున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)