Breaking News

కూటమి కాదు.. కుట్రల ప్రభుత్వం: జోగి రమేష్‌

Published on Mon, 02/03/2025 - 16:45

సాక్షి,తాడేపల్లి:ప్రజాస్వామ్యాన్ని కూటమి ప్రభుత్వం ఖూనీ చేసిందని,అరాచకాలు,అక్రమాలు,దౌర్జన్యాలు చేసి మున్సిపాలిటీల్లో పదవులు దక్కించుకున్నారని వైఎస్సార్‌సీపీ సీనియర్‌నేత మాజీ మంత్రి జోగి రమేష్‌ మండిపడ్డారు. సోమవారం(ఫిబ్రవరి3) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో జోగి రమేష్‌ మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో ఏ కార్పొరేషన్,మున్సిపాలిటీల్లోనూ టీడీపీకి బలం లేదు.

మా పార్టీ వారిని కిడ్నాప్ చేసి గెలుపొందటం సిగ్గుచేటు. మా‌ కార్పొరేటర్లు వెళ్లే బస్సు మీద రాళ్ల దాడి చేయడం దారుణం. తిరుపతి ప్రతిష్టను దిగజార్చారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నికల హామీలను అమలు చేయలేదు. 2019లో చంద్రబాబు ఢిల్లీ వెళ్లి మోదీని తిట్టారు. ఇప్పుడు మళ్ళీ ఢిల్లీ వెళ్లి మోదీని మెచ్చుకుంటూ,కేజ్రివాల్‌ను తిట్టారు. అసలు చంద్రబాబు ఒక మనిషేనా? ఆయనకు సిగ్గుందా? సిద్దాంతాలు,విలువలు లేని ఏకైక మనిషి చంద్రబాబు.

ఐటీ రైడ్స్‌ నుంచి రక్షించుకోవడానికే ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లారు.ఇది కూటమి ప్రభుత్వం కాదు,కుట్రల ప్రభుత్వం.వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లను బెదిరించి, ప్రలోభాలకు గురి చేసి గెలవాలని చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు కుట్రలో పావుగా మారారు.ఈ దాడులు,దౌర్జన్యాలపై ఈసీ స్పందించాలి. అధికార పార్టీ చేస్తున్న దుర్మార్గాలను ఈసీ అడ్డుకోవాలి’అని జోగి రమేష్‌ డిమాండ్‌ చేశారు. 

మున్సిపల్ ఎన్నికల్లో కూటమి నేతలు దౌర్జన్యాలు చేసి గెలిచారు

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)