Breaking News

చంద్రబాబు వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్దం: శైలజానాథ్‌

Published on Sun, 03/02/2025 - 13:02

అనంతపురం: ఏపీలో టీడీపీ కూటమికి చట్టం చుట్టామా అని అన్నారు. మాజీ మంత్రి శైలజానాథ్‌. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధం అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు సంక్షేమం, అభివృద్ధి అందకూడదు అంటే ఎలా? అని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు.

వైఎస్సార్‌సీపీ నాయకులు శైలజానాథ్‌ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్థాయిని దిగజార్చుకున్నారు. ఆయన వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధం. చేసిన ప్రమాణానికి విరుద్ధంగా చంద్రబాబు వ్యవహార శైలి ఉంది. అంతఃకరణ శుద్ధితో పనిచేయాలని భారత రాజ్యాంగం చెబుతోంది. సీఎం, మంత్రులు రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాలి. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు సంక్షేమం, అభివృద్ధి అందకూడదు అంటే ఎలా?.

రాష్ట్రంలో కులాలు, మతాలకు అతీతంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ సంక్షేమ ఫలాలు అందించారు. వైఎస్‌ జగన్‌ను చూసి చంద్రబాబు పాలన నేర్చుకోవాలి. వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై అసభ్య పదజాలంతో టీడీపీ కూటమి నేతలు పోస్టింగ్స్ పెడుతున్నారు. టీడీపీ కూటమికి చట్టం చుట్టమా?. వారు ఎన్ని తప్పులు చేసినా ఎక్కడా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు ఎందుకు?’ అని ప్రశ్నించారు.

రెడ్‌బుక్‌ పేరుతో లోకేష్‌ అరాచకలు..
మరోవైపు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు దుర్మార్గం. వైఎస్సార్‌సీపీ నేతలపై చంద్రబాబు వ్యాఖ్యలు అప్రజాస్వామికం. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ప్రజలందరికీ బాధ్యుడిగా ఉండాలి. చంద్రబాబు తన వ్యాఖ్యలను వెంటనే ఉప సంహరించుకోవాలి. లేకపోతే ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు అనర్హుడు అని భావిస్తాం. రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో నారా లోకేష్ అరాచకాలు చేస్తున్నారు. బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగితే సీఎం హోదాలో ఉన్న వైఎస్సార్ రాజకీయాలు చూడలేదు. కులాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైఎస్ జగన్‌దే’ అని తెలిపారు.  

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)