Breaking News

ముచ్చుమర్రి ఘటన ముమ్మాటికీ బాబు సర్కార్‌ వైఫల్యమే: వైఎస్సార్‌సీపీ

Published on Sun, 11/03/2024 - 18:44

సాక్షి, నంద్యాల జిల్లా: ముచ్చుమర్రి బాలిక ఘటన కలిచివేసిందని.. ఈ ఘటన జరిగి నాలుగు నెలలు గడిచినా ఇంత వరకు పాప ఆచూకీ దొరక లేదని నంద్యాల జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ముచ్చుమర్రి ఘటన కేసులో నిందితులకు బెయిల్ లభించడంపై ఆయన  స్పందిస్తూ.. దిశ చట్టాన్ని అమలు చేయడంలో చంద్రబాబు విఫలం అయ్యారని మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను పూర్తిగా చంద్రబాబు నిర్వీర్యం చేసేశారన్నారు. బాలికపై లైంగికదాడికి పాల్పడిన కామాంధులను కఠినంగా శిక్షించాలన్నారు. బాలిక తల్లిదండ్రులకు వైఎస్సార్‌సీపీ ఎప్పడూ అండగా ఉంటుందన్నారు.

బాబు, పవన్ ఎందుకు స్పందించడం లేదు: విరూపాక్షి
ముచ్చుమర్రి బాలిక ఘటనపై ఎమ్మెల్యే విరూపాక్షి మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే మహిళలపై అరాచకాలు పెరిగాయని మండిపడ్డారు. ముచ్చుమర్రి బాలిక ఘటన ముమ్మాటికీ ప్రభుత్వం వైఫల్యమేనన్నారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించడం లేదు’’ అంటూ విరుపాక్షి ప్రశ్నించారు.

హోంమంత్రికి ఈ ఘటనలు కనబడవా?: ఇషాక్‌ బాషా
ముచ్చుమర్రి బాలిక లైంగికదాడి ఘటన చాలా బాధాకరమని.. నాలుగు నెలలు గడిచిన ఈ కేసుపై ఎలాంటి పురోగతి లేదని ఎమ్మెల్సీ ఇషాక్ బాషా అన్నారు. ఈ కేసులో అరెస్టయిన నిందితులకు బెయిల్ వచ్చింది. రాష్ట్ర హోంమంత్రికి ఈ ఘటనలు కనబడుతున్నాయా?. చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రంలో బాలికలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి’’ అని ఇషాక్‌ బాషా చెప్పారు.

Videos

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

Photos

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)