Breaking News

బాబూ.. ఇదే మందు నాడు విషమైతే నేడు అమృతమా?: రాచమల్లు

Published on Thu, 11/21/2024 - 11:41

సాక్షి, వైఎస్సార్‌: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం బ్రాండ్‌లపై చంద్రబాబు విష ప్రచారం చేశారని ఆరోపించారు వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్‌ రెడ్డి. రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గిస్తామన్న చంద్రబాబు హామీ ఏమైంది? అని ప్రశ్నించారు. అలాగే, ఏపీలో గతంలో ఉన్న బ్రాండ్సే ప్రస్తుతం ఏపీ వైన్‌ షాపుల్లో ఉన్నాయి.

వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘ఎన్నికల సమయంలో మందుబాబులను రెచ్చగొట్టి చంద్రబాబు లబ్ధి పొందారు. ఎన్నికలు అయ్యాక మద్యం ధరలు తగ్గిస్తామని మోసం చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం బ్రాండ్‌లపై చంద్రబాబు విష ప్రచారం చేశారు. గతంలో ఉన్న బ్రాండ్స్‌  ప్రస్తుతం ఏపీ వైన్‌ షాపుల్లో ఉన్నాయి. మా ప్రభుత్వ హయాంలో ఉన్న ధరలే ఇప్పుడూ ఉన్నాయి. మద్యం ధరలు తగ్గిస్తామన్న చంద్రబాబు హామీ ఏమైంది? అని ప్రశ్నించారు.

వైఎస్‌ జగన్ ప్రభుత్వంలో అధిక ధరలన్నాడు.. నాణ్యత లేదన్నాడు. ఆడ పిల్లల మంగళ సూత్రాలు తెంపుతాడు.. మీ ఆరోగ్యం గోవింద అన్నాడు. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయాడు. 99 రూపాయలకే మద్యం అన్నాడు.. కానీ ఆ చీఫ్ లిక్కర్ మాత్రం దొరకడం లేదు. మీరిచ్చిన మాట ప్రకారం ధరలు ఎక్కడ తగ్గించారు?. జగన్ ప్రభుత్వంలో అది విషం.. ఇప్పుడు అదే మందు అమృతం అవుతుందా?. ఇప్పుడు ఆడ బిడ్డల మెడలో తాళిబొట్టు తెగవా?. మేము ఓడిపోవడానికి ప్రధాన కారణం మద్యం తాగే సోదరులే. వారితో ఓటు వేయించుకుని అధికారంలోకి వచ్చి ఇప్పుడు వారిని కూడా బాబు మోసం చేశాడు.

చంద్రబాబు ఇచ్చే చీఫ్ లిక్కర్ 99కి అమ్మితే.. అదే మందు కేరళలో 85కి ఇస్తున్నారు. దానికి తోడు ఈ చీఫ్ లిక్కర్ నాణ్యమైనది కాదనేది నా అభిప్రాయం. కొన్ని ఏళ్లు ఈ మద్యం తాగితే వారి ఆరోగ్యం తప్పకుండా చెడిపోతుంది. చివరికి మద్యం వ్యాపారులను కూడా మోసం చేశారు. వారికి 20 శాతం మార్జిన్ అని చెప్పి ఇప్పుడు 9.5శాతం మార్జిన్ ఇస్తున్నాడు. విచ్చలవిడిగా బెల్టు షాపులు వెలిశాయి.. అధిక ధరలకు మద్యం అమ్ముతున్నారు. మా ప్రభుత్వంలో 47వేల బెల్టు షాపులు రద్దు చేస్తే మళ్ళీ వాటిని తెరిచి విచ్చలవిడిగా అమ్ముతున్నారు. మద్యం షాపులు సంఖ్య తగ్గించి పర్మిట్ రూమ్స్ లేకుండా చేశాం. కానీ, మళ్ళీ చంద్రబాబు పాత రోజులు తెచ్చి మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు

Videos

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)