ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం: వైఎస్‌ జగన్‌

Published on Tue, 02/25/2025 - 04:02

శాసన సభలో ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్‌సీపీనే. మరో విపక్ష పార్టీ అంటూ లేదు. మిగతావన్నీ అధికారంలో కొనసాగుతున్న పార్టీలే. మరి ప్రతిపక్ష హోదా ఎవరికి ఇస్తారు? సహజంగానే వైఎస్సార్‌సీపీకే ఇవ్వాలి కదా! హోదా ఇవ్వకపోతే ఎందుకు నడుపుతున్నారు? అవతలి వారు చెప్పేది మనం వినకూడదనుకుంటే ఇక అసెంబ్లీ ఎందుకు? ప్రతిపక్షం చెప్పేది ఆలకించాలి. తద్వారా లోపాలను సరిదిద్ది ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అవకాశం ఉంటుంది. ఎంతసేపూ పరనింద.. ఆత్మస్తుతేనా? అలాంటప్పుడు ఇక ప్రజాస్వామ్యానికి అర్థం లేదు. 
– వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటాన్ని కొనసాగి­స్తామని వైఎస్సార్‌సీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) పునరుద్ఘాటించారు. కూటమి ప్రభు­త్వంపై క్షేత్ర స్థాయిలో తీవ్ర వ్యతి­రేకత నెలకొందని.. టీడీపీ ఇస్తా­మన్న పథకాలన్నీ మోసాలుగా మిగి­లి­పోయాయని ధ్వజమెత్తారు. సోమ­వారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్‌ జగన్‌ సమావేశమయ్యారు. ‘మనం యుద్ధరంగంలో ఉన్నాం.. విజయం దిశగా అడుగులు వేయాలి.. 

ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేయాలి.. నిజాయితీగా, చిత్తశుద్ధితో ప్రజల తరఫున పోరాటం చేయాలి.. ప్రజలకు తోడుగా ఉంటూ వారితో మమేకమైతే గెలుపు సాధించినట్లే. ప్రజా సమస్యలపై పోరాటంలో వెనుకడుగు వేయవద్దు. మనం వేసే ప్రతి అడుగూ పార్టీ ప్రతిష్టను పెంచేదిలా ఉండాలి. ఎక్కడా రాజీ పడకూడదు’ అని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు. సమావేశంలో వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

మీ భవిష్యత్తుకు నాది భరోసా..
ఈ ప్రభుత్వాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షంలో మన సమర్ధతను నిరూపించుకోవడానికి ఇదొక అవకాశం. ప్రతి ఒక్కరికీ నేను భరోసా ఇస్తున్నా. మీ భవిష్యత్తుకు నాది భరోసా. నేను మరో 30 ఏళ్లు రాజకీయాలు చేస్తా. పార్టీ కోసం, ప్రజల కోసం గట్టిగా పని చేస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. కళ్లు మూసుకుని తెరిచేలోగా ఏడాది గడిచిపోతోంది. జమిలి ఎన్నికలు అంటున్నారు. 

అదే జరిగితే ఎన్నికలు మరింత మందుగా వస్తాయి. అందుకే ప్రజా సమస్యల విషయంలో ఎక్కడా రాజీ వద్దు. ప్రజల తరపున గొంతు విప్పే విషయంలో ఎక్కడా తగ్గాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో మనం విలువలు, విశ్వసనీయత పాటిస్తున్నాం కాబట్టే ఎన్నో క్లిష్ట పరిస్థితులు అధిగమించాం. ఇంత దూరం ప్రయాణం చేశాం. దేవుడు మనల్ని అందరినీ తప్పకుండా ఆశీర్వదిస్తాడు.

అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు..
అసెంబ్లీలో మనం మినహా వేరే ప్రతిపక్షం లేదు. ప్రతిపక్ష హోదా ఇస్తే.. హక్కుగా మనకు సమయం ఇవ్వాల్సి వస్తుంది. సభా నాయకుడితో  దాదాపు సమాన స్థాయిలో సమయం ఇవ్వాల్సి ఉంటుంది. 

ఆ భయంతోనే ప్రతిపక్ష హోదాను ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. ఆ విధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ప్రతిపక్ష హోదా విషయంలో అధికార పార్టీ వైఖరిని ప్రజలకు తేటతెల్లం చేసేందుకే ఇవాళ అసెంబ్లీకి వెళ్లాం. శాసన సభలో మనం ఒక్కరమే ప్రతిపక్షం. అందుకే విపక్ష హోదా అడుగుతున్నాం. సభలో ప్రతిపక్షం స్వరాన్ని వినాలి. తప్పులుంటే సరిదిద్దుకోవాలి. 

నేను ఏ అంశంపై మాట్లాడినా నిందలకు, దూషణలకు దూరం. ప్రతి అంశాన్నీ ఆధారాలు, రుజువులతో మాట్లాడతా. నా ప్రసంగాల్లో కూడా చాలా సార్లు సభలో చంద్రబాబునాయుడు ఉంటే బాగుండేదని చెప్పా. అయితే ప్రభుత్వ స్వరం మినహా వేరే స్వరం వినపడకూడదన్నట్లు అసెంబ్లీని తయారు చేశారు.

ప్రజలకు అన్నీ తెలుసు..
పేదల ఇళ్ల కాలనీల పేర్లు కూడా మారుస్తున్నారని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశంలో ప్రస్తావించగా.. ‘‘ఎవరు ఇళ్ల స్ధలాలిచ్చారో, ఎవరు కాలనీలు ఏర్పాటు చేశారో ప్రజలకు తెలుసు. విజయవాడలో అంబేడ్కర్‌ స్మృతివనాన్ని మనమే నిర్మించాం. కానీ పేరు తీసేయాలన్న దురుద్దేశంతో ఏకంగా అంబేడ్కర్‌ విగ్రహం మీదే దాడికి దిగారు. ఈ ప్రభుత్వం ఆదేశాలతోనే అదంతా జరిగింది. 

అధికారులే స్వయంగా దీనికి ఒడిగట్టారు. మరి స్మృతివనం ఎవరు కట్టారో ప్రజలకు తెలియదా? ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా ప్రజలకు నేరుగా రూ.2.73 లక్షల కోట్లు అందించి మనం మంచి చేశాం. ఇవాళ మనమిచ్చిన పథకాలన్నీ రద్దు చేశారు. నోటి దాకా వచ్చిన కూడును తీసేశారు. టీడీపీ వాళ్లు ఇస్తామన్న పథకాలన్నీ మోసాలుగా మిగిలాయి’’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

ఇళ్ల పట్టాలు రద్దు చేస్తే కోర్టుకెళ్తాం..
టీడీపీ కూటమి ప్రభుత్వం అన్యాయంగా ఇళ్ల పట్టాలను రద్దు చేస్తోందని సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై వైఎస్‌ జగన్‌ స్పందిస్తూ.. ‘‘మన హయాంలో 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. 

ఏ పార్టీ అని చూడకుండా, పక్షపాతం లేకుండా ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఎవరైనా ఇల్లు కట్టుకోకపోతే ప్రభుత్వమే వారికి ఇల్లు మంజూరు చేసి ఇవ్వాలి. అంతేకానీ పేదలపై కక్షగట్టి పట్టాలు రద్దు చేయడం ఏమిటి? పట్టాలు రద్దు చేస్తే తప్పకుండా కోర్టును ఆశ్రయిస్తాం’’ అని స్పష్టం చేశారు. 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)