Breaking News

వైఎస్సార్‌సీపీ కోటి సంతకాల కార్యక్రమం సూపర్ సక్సెస్

Published on Fri, 12/19/2025 - 08:37

సాక్షి, తాడేపల్లి: కోటి సంతకాల కార్యక్రమం సూపర్ సక్సెస్ అయ్యింది. చంద్రబాబు నిర్ణయాన్ని జనం తీవ్రంగా తప్పుపట్టారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కాపాడుకునేందుకు వైఎస్ జగన్ పోరాటం చేస్తున్నారు. ప్రజారోగ్యానికి వైఎస్‌ జగన్‌ బాసటగా నిలిచారు. ప్రైవేటీకరణ పేరుతో స్కాం చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్‌ జగన్‌.. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే జైలుకు పంపుతామంటూ హెచ్చరించారు.

గవర్నర్‌ని కలిసి కోటి 4 లక్షల 11,136 సంతకాల ప్రతులు అందజేత  చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలని వినతించారు. జగన్ రాకతో విజయవాడ రోడ్లు కిటకిటలాడాయి. అన్ని వర్గాల ప్రజల నుంచి వైఎస్‌ జగన్ పోరాటానికి మద్దతు లభించింది. కార్యక్రమం సక్సెస్‌ కావడం పార్టీ కేడర్‌కు ఫుల్ జోష్‌ ఇచ్చింది.

రాష్ట్ర ప్రజల ఆకాంక్షను గవర్నర్‌కు నివేదించామని, ఈ పోరాటం ఇంతటితో ఆగదని.. న్యాయ పోరాటం.. ప్రజల్లోకి వెళ్లి పోరాటం కూడా చేస్తామని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులతో కూడిన 26 వాహనాలను (గురువారం డిసెంబర్‌ 18)న లోక్‌భవన్‌కు తరలించారు. గవర్నర్‌ కార్యాలయ అధికారులు కె.రఘు (డిప్యూటీ సెక్రటరీ టు గవర్నర్‌), ఎన్‌.వెంకటరామాంజనేయులు (ఏడీసీ) ఆ పత్రాలు పరిశీలించారు. వాటన్నింటినీ వైఎస్‌ జగన్‌ తన భేటీలో గవర్నర్‌కు చూపారు. తాడేపల్లి లోని తన నివాసం నుంచి బయలు దేరిన వైఎస్‌ జగన్‌ నేరుగా తొలుత డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌ స్మృతివనాన్ని సందర్శించి నివాళులర్పించారు.

 

 

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)