Breaking News

నెల్లూరు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్‌ కిడ్నాప్‌

Published on Thu, 12/11/2025 - 19:55

సాక్షి, నెల్లూరు‌: పార్టీ మారిన గంటల వ్యవధిలోనే.. కార్పొరేటర్‌ కిడ్నాప్‌ కావడం నెల్లూరులో కలకలం రేపుతోంది. సిటీ 5వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఓబుల రవిచంద్ర మరో నలుగురితో కలిసి గురువారం వైఎస్సార్‌సీపీలో చేరారు. తాడేపల్లిలో పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆయనకు కండువా కప్పారు. అయితే..   

నెల్లూరకు తిరిగి వస్తున్న ఆయన్ని పోలీసులమని చెప్పి కొందరు తీసుకెళ్లారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన రవిచంద్ర ఆచూకీ కోసం హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేయాలనే యోచనలో ఉన్నారు. మరోపక్క.. నెల్లూరులో బలం ఉన్నా టీడీపీ బరి తెగించిందనే విమర్శ బలంగా వినిపిస్తోంది. 

మేయర్‌పై అవిశ్వాసం వేళ.. నెల్లూరులో టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. ఐదుగురు కార్పొరేటర్లు టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు. మద్దినేని మస్తానమ్మ (నెల్లూరు సిటీ 6వ డివిజన్‌ కార్పొరేటర్‌), ఓబుల రవిచంద్ర (నెల్లూరు సిటీ 5వ డివిజన్‌ కార్పొరేటర్‌), కాయల సాహితి (నెల్లూరు సిటీ 51వ డివిజన్‌ కార్పొరేటర్‌), వేనాటి శ్రీకాంత్ రెడ్డి (నెల్లూరు సిటీ 16వ డివిజన్‌ కార్పొరేటర్), షేక్‌ ఫమిదా (నెల్లూరు రూరల్ 34వ డివిజన్‌ కార్పొరేటర్‌)లను  మాజీ మంత్రి అనిల్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ దగ్గరుండి వైఎస్‌ జగన్‌ను కలిపించి.. పార్టీలో చేర్పించారు. అయితే మరింత మంది కార్పొరేటర్లు పార్టీ మారే భయంతో ఉన్న టీడీపీ.. ఇలా కిడ్నాప్‌ల పర్వానికి దిగిందని స్పష్టమవుతోంది.

Videos

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)