Breaking News

భక్తుల మనోభావాలు దెబ్బతినేలా బాబు వ్యవహరించారు: వైవీ సుబ్బారెడ్డి

Published on Fri, 10/04/2024 - 14:34

సాక్షి, ఢిల్లీ: తిరుమల లడ్డూ విషయంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. వీలైనంత త్వరగా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను అంటూ కామెంట్స్‌ చేశారు. ఇదే సమయంలో సీబీఐ విచారణతో న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నట్టు తెలిపారు.

ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘టీటీడీ లడ్డూ విషయంలో గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగాయని మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పును మేము స్వాగతిస్తున్నాము. సీబీఐ విచారణతో న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నాము. పొలిటికల్ కామెంట్ చేయొద్దు అని కోర్టు చెప్పింది. చంద్రబాబు వ్యాఖ్యల కారణంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో నిజాలు బయటపెట్టేలా విచారణ జరిపించాలని పిటిషన్ వేయడం జరిగింది. ఆరోపణలు నిజమైతే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని చెప్పాము.

నా హయాంలో ఏఆర్‌ కంపెనీ నుంచి ఎప్పుడూ నెయ్యి సరఫరా జరగలేదు. ఎన్నికల సమయంలో టెండర్ ఆమోదించారు. కల్తీ జరిగితే ఎలాంటి పదార్థాలు కలిశాయి అన్నది కూడా తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నింద వేసింది కాబట్టి ఇక వెనక్కి వెళ్లొద్దు అన్న ధోరణిలో మాట్లాడుతున్నారు. వీలైనంత త్వరగా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. విచారణ ముగిసే వరకు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉంటుంది. మాపై చేసిన నిందలు తొలగిపోతాయని అనుకుంటున్నాము. మేము ఉన్న సమయంలో కల్తీ జరగలేదు. లడ్డులను ఇంతవరకు టెస్ట్ చేయలేదు’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: ‘సుప్రీం’ నిర్ణయం చంద్రబాబుకు చెంపపెట్టు: వైఎస్సార్‌సీపీ

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)