Breaking News

బడ్జెట్‌ కేటాయింపులు లేకుండా పోలవరం ఎలా పూర్తి చేస్తారు: ఎంపీ విజయసాయిరెడ్డి

Published on Thu, 08/08/2024 - 15:30

సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో గత 60 రోజుల పాలనలో రోజుకో హత్య జరుగుతోందన్నారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. రాష్ట్రంలో ఈ హత్యలకు ఎవరు పాల్పడుతున్నారో అందరికీ తెలుసు అంటూ కామెంట్స్‌ చేశారు. ఇదే సమయంలో బడ్జెట్‌లో పోలవరానికి నిధులు కేటాయించకుండా ఎలా ప్రాజెక్ట్‌ నిర్మాణం ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. 

కాగా, ఎంపీ విజయసాయిరెడ్డి పార్లమెంట్‌ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈరోజు రాజ్యసభలో ఫైనాన్స్‌ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 60 రోజుల్లో 36 రాజకీయ హత్యలు జరిగాయి. ఎవరు ఈ హత్యలకు పాల్పడుతున్నారో అందరికీ తెలుసు. వాగ్నర్ గ్రూపు తరహాలో హత్యలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో పోలీసు భద్రతను పెంచాలి, హోంశాఖకు తగిన నిధులు కేటాయించాలన్నారు. 

అలాగే, తెలంగాణ నుంచి ఏపీ జెన్‌కోకు రూ. 7000 కోట్ల  బకాయిలు రావాలి.  ఏపీకి బకాయిలు చెల్లించాలని కేంద్రం తెలంగాణకు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ బకాయిలు ఇవ్వని నేపథ్యంలో పన్నుల వాటాలో కోత విధించాలి. ఏపీలో ఎన్డీఏ సీఎం, తెలంగాణలో కాంగ్రెస్ సీఎం మధ్య స్నేహం కొనసాగుతోంది. ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెట్టే విధంగా ఈ స్నేహం కొనసాగితే అంగీకరించం. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను మేరకు నిధులు ఇవ్వాలి. పోలవరం ప్రాజెక్టుకు బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. ఇలా కేటాయింపులు లేకుండా ప్రాజెక్టులు ఎలా పూర్తి చేస్తారు. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌ తగ్గించాలి.  సేవింగ్స్ బ్యాంకు ఖాతాలపై జరిమానాలు వేయవద్దు. సమగ్రమైన జీవిత బీమా పథకాలు తీసుకురావాలి’ అని అన్నారు.

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)