తిరుమల జోలికి వెళ్లొద్దు.. చంద్రబాబుకు విజయసాయి వార్నింగ్‌

Published on Thu, 10/03/2024 - 10:34

సాక్షి, అమరావతి: తిరుమల జోలికి వెళ్లొద్దంటూ సీఎం చంద్రబాబును వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హెచ్చరించారు. ‘‘మీ కుళ్లు రాజకీయాలకు దేవుడిని వాడుకోవద్దు. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తే నాశనమైపోతారు’ అంటూ విజయసాయి ట్వీట్‌ చేశారు.

మరోవైపు, పురందేశ్వరిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలంటూ  విజయసాయిరెడ్డి డిమాండ్‌ చేశారు. ‘తిరుమల లడ్డూ ప్రసాదాల విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కనీస ఇంగితజ్ఞానం లేకుండా అత్యు­న్నత న్యాయస్థానాన్ని, న్యాయమూ­ర్తులను తప్పు పడుతూ వారి ప్రతిష్టకు భంగం కలిగించేలా అగౌరవపరుస్తూ చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధం. కోర్టు ధిక్కారం... ఆమెపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి.’ అని ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

ఇదీ చదవండి: నాలుగు నెలల్లోనే.. అన్నింటా విఫలం: వైఎస్‌ జగన్‌

‘పురందేశ్వరి మొత్తం మీద సుప్రీంకోర్టుదే తప్పు అని తేల్చారు. చంద్రబాబు రాజ్యాంగ పదవిలో ఉన్నాడు కాబట్టి ఆయన ఏదైనా అనొచ్చంట... ఏమమ్మా! మరి న్యాయవ్యవస్థ కూడా రాజ్యాంగ వ్యవస్థే కదా! తమరికి తెలియదా? అంత చిన్న విషయానికే న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేస్తారా? అని చిరాకు పడిపోయారు పురందేశ్వరి. ఆమెది భావాతీతమైన ఆవేదన అనుకోవాలి మరి.

కోర్టులు, దేవుడి కంటే చంద్రబాబే గొప్పవాడు అన్నట్లుంది పురందేశ్వరి వైఖరి. ఈ వందేళ్లలో తిరుమల ఆలయానికి నారా, నందమూరివారు చేసిన డ్యామేజీ మరి ఎవరూ చేయలేదు. ఇంకెన్ని ఘోరాలు చూడాలో గోవిందా... గోవిందా.. లడ్డూ ప్రసాదాల విషయంలో చంద్రబాబు హిందువుల మ­నోభావాలను దెబ్బతీయటమే కాకుండా మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్య­లు చేశారు.’ అని విజయసాయిరెడ్డి మండిపడ్డారు.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)