Breaking News

‘కమీషన్లు, ముడుపులు.. ‘దారి’తప్పిన టీడీపీ ఎమ్మెల్యేలు’

Published on Thu, 10/10/2024 - 15:24

సాక్షి, తాడేపల్లి: టీడీపీ ఎమ్మెల్యేల అవినీతిపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఏపీలో కమీషన్లు, ముడుపులు, దందాలతో టీడీపీ ఎమ్మెల్యేలు దారితప్పారంటూ ట్వీట్‌ చేశారు. 90 శాతం మంది టీడీపీ ఎమ్మెల్యేల అవినీతి పరాకాష్టకు చేరడంతో నాలుగు నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేక ప్రభావం పడిందన్న విజయసాయి.. పోస్టింగులకు ఒక రేటు, మద్యంలో నెలమామూళ్లు, వెంచర్లలో కమీషన్లు, కాంట్రాక్టర్ల దగ్గర పెర్సెంటేజిలు, ప్రొటెక్షన్ మనీ, అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు బరితెగించారంటూ దుయ్యబట్టారు.

‘‘గత ప్రభుత్వ హయాంలో టీడీపీ గూఢచారులుగా ప్రవర్తించిన అధికారులకు క్లీన్‌ చిట్‌లు, మంచిరాబడి ఉన్న పోస్టింగులు, పదోన్నతులు. మద్యంషాపుల దరఖాస్తుల్లో టీడీపీ ఎమ్మెల్యేలు సిండికేట్ అయ్యి సర్కార్ ఖజానాకు  గండి. లిటిగేషన్లు, నోటిదురుసులు, వ్యభిచారాలు, ఆమ్యామ్యాలు, మాఫియాలు, దందాలు, బ్లాక్మెయిలింగ్, వెంచర్లు, మద్యం.. దేన్నీ వదలకుండా టీడీపీ ప్రజాప్రతినిధులు అడ్డగోలుగా దిగమింగే దాంట్లో పూర్తి నిమగ్నం’’ అంటూ టీడీపీ నేతల్ని విజయసాయిరెడ్డి ఏకిపారేశారు.

ఇదీ చదవండి: చంద్రబాబుకి నిజం అంటే భయం.. అందుకే : 

‘‘ఐదు సంవత్సరాల తర్వాత అవకాశం దొరికినప్పుడు మేం మింగితే తప్ప్పేమిటి.. మళ్ళీ మళ్ళీ  అవకాశం వస్తుందో రాదో అని అడ్డంగా సమర్ధించుకుంటున్న తెలుగు తమ్ముళ్లు. టీడీపీ ఎమ్మెల్యేలపై వస్తున్న ఆరోపణలఫై చంద్రబాబు స్పందించి సమాధానం చెప్పాలి. లేనట్లయితే ప్రజాభీష్టం మేరకు శ్వేతపత్రం సమర్పించి విచారణకు ఆదేశించాలి’’ అని ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్‌ చేశారు.

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)