Breaking News

కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ఒరిగిందేమీ లేదు: ఎంపీ విజయసాయిరెడ్డి

Published on Thu, 07/25/2024 - 21:37

సాక్షి, ఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ఒరిగిందేమీ లేదని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. రాజ్యసభలో బడ్జెట్‌పై చర్చలో ఆయన మాట్లాడుతూ.. బడ్జెట్‌లో ఏపీకి ఒక్క పైసా ఇవ్వలేదన్నారు. ఇచ్చామంటున్న రూ.15 వేల కోట్లు రుణంగానే ఇస్తున్నారు. రూ.15 వేల కోట్ల రుణంపై వడ్డీ కూడా ఏపీనే భరించాలి. కేంద్ర బడ్జెట్‌ కేటాయింపులు చూస్తే ఏపీకి అన్యాయం జరిగినట్టే.. కేంద్రం నిధులు దోచుకోవడానికే పోలవరాన్ని చంద్రబాబు చేపట్టారు’’ అని విజయసాయిరెడ్డి అన్నారు.

‘‘ఎన్డీఏ హయాంలో ఏపీ హింసకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఎన్డీఏ కూటమి నేతృత్వంలో ఇది జరుగుతోంది. టార్గెట్‌గా హత్యలు, దాడులు జరుగుతున్నాయి. 490 ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీలను టార్గెట్ చేశారు. ఏపీ ప్రభుత్వం ప్రస్తుత ప్రజాస్వామ్యానికి చేటు కలిగిస్తుంది. ఏపీలో ఒక వర్గం  మీడియా ఎల్లో జర్నలిజం నడిపిస్తుంది. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను బలోపేతం చేయాలి. తప్పుడు వార్తలు ప్రసారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని విజయసాయిరెడ్డి కోరారు.

పునర్విభజన చట్టానికి కట్టుబడ్డామన్న కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాను విస్మరించింది. పార్లమెంట్‌లో వాగ్దానం చేసిన కేంద్రం ప్రత్యేక హోదాను ఏపీకి ఇచ్చి తీరాల్సిందే’’ అని విజయసాయిరెడ్డి డిమాండ్‌ చేశారు.
 

Videos

నా చావుకు కారణం ఆ ముగ్గురే.! మాధురి రాథోడ్ లేఖ వైరల్..

కుప్పకూలిన భారీ భవనం.. శిథిలాల కింద 50 మంది విద్యార్థులు..?

ఎవడికీ భయపడాల్సిన పని లేదు... చంద్రబాబుకు రోజా స్ట్రాంగ్ వార్నింగ్

హే మిస్టర్.. దమ్ముంటే CBI ఎంక్వైరీ వేయ్..

ఒక్కడే ఒక సైన్యంలా.. కలుషిత నదికి ప్రాణం పోస్తున్న యువకుడు..!

నేను జగన్ చెంచాను అయితే.. నువ్వు చంద్రబాబు కు చెంచావా..?

హెరిటేజ్ లో పాలు అమ్మినట్టు.. టీచర్ పోస్టులను అమ్మేశారు

ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం!

సాక్షి ఇన్వెస్టిగేషన్ లో సంచలన విషయాలు.. DSC అక్రమాలపై తిరుగులేని సాక్ష్యాలు

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

Photos

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)

+5

నిర్మాతల మండలి ఎన్నికలు..ఓటేసిన టాలీవుడ్‌ సెలెబ్రెటీలు (ఫోటోలు)

+5

ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 06 -సెప్టెంబర్ 12)

+5

'అంతా రాములోరు చూసుకుంటారు' మూవీ టైటిల్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో సీరియల్ బ్యూటీ.. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ (ఫొటోలు)

+5

చెన్నైలో నా రోజు ఇలా గడిచింది (ఫొటోలు)

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)