Breaking News

కేంద్రాన్ని ఒప్పించడంలో బాబు విఫలం: ఎంపీ విజయసాయిరెడ్డి

Published on Thu, 10/24/2024 - 07:09

సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరగకుండా కేంద్రాన్ని ఒప్పించడంలో చంద్రబాబు విఫలమయ్యారని అన్నారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఇదే సమయంలో కూటమి పాలనపై 100 రోజుల్లోనే వ్యతిరేకత ప్రారంభమైందని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు అమలు చేయడం లేదన్నారు.

వైఎస్సార్‌సీపీ ఎంపీ, ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి బుధవారం రాత్రి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్బంగా ఆయనకు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ..‘విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్‌సీపీ వ్యతిరేకం. అవసరమైతే విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం. ప్రైవేటీకరణ జరగకుండా కేంద్రాన్ని ఒప్పించడంలో చంద్రబాబు విఫలమయ్యారు. స్టీల్ ప్లాంట్‌పై కూటమి ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది.

కూటమి పాలనపై 100 రోజుల్లోనే వ్యతిరేకత ప్రారంభమైంది. చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదు. దస్పల్లా, ఎన్‌సీసీ భూములతో నాకు ఎటువంటి సంబంధం లేదు. ఎలాంటి విచారణకైనా నేను సిద్ధం. ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నా ఎటువంటి అభ్యంతరం లేదు.

డయేరియా బాధితులను వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పరామర్శిస్తారు. డయేరియాతో 14 మంది మరణించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తాను. పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తాం. దీపావళి తర్వాత రీజినల్ కోఆర్డినేటర్‌గా బాధ్యతలు స్వీకరిస్తాను. పార్టీ బలోపేతం కోసమే రీజనల్ కోఆర్డినేటర్లు జిల్లా అధ్యక్షులు మార్పు జరిగింది అని కామెంట్స్‌ చేశారు.

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)