Breaking News

టీడీపీకి మాయని మచ్చ.. చరిత్ర క్షమించదు: విజయసాయిరెడ్డి

Published on Fri, 11/15/2024 - 13:16

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ నేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. కొందరు పచ్చ నేతలు పుట్టుకతోనే చంద్రబాబుకు విధేయులమని చెప్పుకోవడం సిగ్గుచేటు.. ప్రజలను వంచించడమే అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా..‘నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు ‘వీర విధేయుల్లో' కొందరు 30 ఏళ్ల నాటి ఎన్టీఆర్‌–లక్ష్మీ పార్వతికి అత్యంత సన్నిహితులనేది వాస్తవం, చారిత్రక పరిణామం. దాచేస్తే దాగని, మార్చలేని సత్యం! వీరు 1994-96 కాలంలో ఫిరాయింపుదారులు. ప్రజలకు మీడియాకు గుర్తుండదనుకోవడం వారి అజ్ఞానం. తాము పుట్టుకతోనే చంద్రబాబుకు విధేయులమని చెప్పుకోవడం సిగ్గుచేటు మరి ప్రజలని వంచించడమే.

వీళ్ళలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, దాడి వీరభద్రరావు, మాకినేని పెదరత్తయ్య, కె.ప్రతిభా భారతి, కిమిడి కళావెంకటరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, గాలి ముద్దుకృష్ణమ నాయుడు, చిక్కాల రామచంద్రరావు, పరిటాల రవి, గాదె లింగప్ప, ముక్కు కాశి రెడ్డి, గౌతు శివాజీ, గద్దె బాబు రావు. ఎన్టీఆర్ గారికి వెన్నుపోటుపొడిచి బహిష్కరణకు గురియైన వాళ్లలో చంద్రబాబు, యనమల రామకృష్ణుడు, అశోకగజపతి రాజు ఉన్నారు. ఈ నేతల్లో 90 శాతానికి పైగా ఎన్టీఆర్‌ మరణించాక 1996 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్టీఆర్‌ టీడీపీ (ఎల్‌పీ) ఒక్క సీటూ దక్కించుకోకపోవడంతో గుట్టుచప్పుడు కాకుండా చంద్రబాబు పార్టీలో చేరి 1997–2004 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ మంత్రివర్గం సభ్యులుగా, కొందరు ఎంపీలుగా, మరి కొందరు పార్టీ పదవులు పొందారు. మాయని మచ్చ-చరిత్ర క్షమించదు’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)