Breaking News

వైఎస్‌ జగన్‌ను మళ్లీ సీఎంగా చేసుకోవాలి: ఆర్‌.కృష్ణయ్య

Published on Wed, 03/20/2024 - 17:08

సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేదల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 50 ఏళ్ల నుంచి బీసీల కోసం నేను పోరాడుతున్నా. 12 వేల ఉద్యమాలు చేశాం. 2 వేల జీవోల సాధించామని ఆయన పేర్కొన్నారు.

సీఎం జగన్‌ను చూసి దేశంలోని ఇతర రాష్ట్రాల సీఎంలు ఆశ్చర్యపోతున్నారు. సీఎం జగన్‌కి ఉన్నంత ధైర్యం, సాహసం, నిజాయితీ ఎవరికీ లేవు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చరిత్రలో ఎన్నడూ చేయనంత మేలు చేస్తున్నారు. గత ప్రభుత్వాలు మమ్మల్ని ఓట్లుగానే చూశాయి. సీఎం జగన్‌ మాత్రమే తన కుటుంబంలా చూసుకున్నారు. వైఎస్‌ జగన్‌ను మళ్లీ సీఎంగా చేసుకోవాలి. ప్రజల అభివృద్ధే సీఎం జగన్‌ అభివృద్ధి. ప్రజలు దేవుడి ఫోటోతో పాటు సీఎం జగన్‌ ఫోటోను పెట్టుకుంటున్నారు. నేను కర్నూలులో స్వయంగా
చూశా. సీఎం జగన్‌ రాజకీయ నాయకుడు కాదు.. సంఘ సంస్కర్త.’’ అంటూ కృష్ణయ్య కొనియాడారు. 

‘‘ఎలాంటి పోరాటం చేయకుండానే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సీఎం జగన్ మేలు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలంతా నిజాయితీగా ఆలోచించాలి. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్‌ను ఓటేసి గెలిపించాలి’’ అని ఆర్‌.కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)