Breaking News

‘ఓటర్‌కు కనీసం ఓటు వేసే అవకాశం ఇవ్వలేదు’

Published on Thu, 11/05/2026 - 19:34

కడప:   పరిషత్‌ ఎన్నికల నిర్వహణలో సైతం ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యిందని వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి మండిపడ్డారు. మొత్తంగా స్థానిక ఎన్నికల్ని అపహాస్యం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఈ స్థానిక ఎన్నికల్లో అడుగడుగున యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని, చరిత్రలో ఇంత ఘోరంగా ఎప్పుడూ ఎన్నికలు జరగలేదన్నారు. ఎన్నికల్లో కనీసం ఓటరును ఓటు వేసే అవకాశం కూడా ఇవ్వకుండా ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేశారన్నారు. 

పులివెందుల పార్టీ కార్యాలయంలో ఎంపీ అవినాష్‌రెడ్డి ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. ‘ మున్సిపల్ ఎన్నికల తరహాలోనే జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలు.జరిగాయి. పోలీసులే ఎన్నికలు నిర్వహించి ఓటర్లను భయబ్రాంతులకు గురిచేశారు  కూటమి ప్రభుత్వానికి ఎన్నికల అధికారులు వత్తాసు పలికారు.  మా పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధించారు. 

పోలింగ్ కేంద్రంలో మా పార్టీ ఏజెంట్లను అనుమతించలేదు. ఇతర ప్రాంతాల నుంచి జనాలను తరలించి ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నారు. పోలింగ్ కేంద్రాల్లో  సైక్లింగ్ చేశారు. రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. ఎస్పీకి ఫోన్ చేసి తమ పార్టీ ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించాలని కోరిన పట్టించు కోలేదు. పులివెందులలో జరిగిన అక్రమాలపై ఎస్ఈసీకి పిర్యాదు చేశాం. 

మా విన్నపం మేరకు ఆ ప్రాంతాల్లో  రీపొలింగ్ చేయాలి. ఎస్ఈసీ స్పందించకుంటే కోర్టును ఆశ్రయిస్తాం. సీసీ పూటేజీను నిశితంగా పరిశీలించాలి. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడ ఎన్నికల అదికారులు తుంగలో తొక్కారు.  మేబు అడిగినట్టు సీసీ ఫూటేజ్ హార్డ్ డిస్క్ ఇస్తే వారి లీలలు బయట పడతాయి. మాకు ప్రజల బలం ఉందనే భయంతో కూటమి పార్టీలు ఇలాంటి దౌర్జన్యాలకు  పాల్పడ్డారు’ అని ధ్వజమెత్తారు. 

ఇదీ చదవండి: చంద్రబాబు గెలిచి ఓడితే.. మేం ఓడి గెలిచాం: వైఎస్‌ జగన్‌

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)