Breaking News

హోంమంత్రి అనిత రాజీనామా చేయాల్సిందే: ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి

Published on Tue, 06/10/2025 - 16:36

సాక్షి, గుంటూరు:  ప్రతిపక్షనేతలపై కేసులు పెట్టడమే కూటమి ప్రభుత్వం పనిగా పెట్టుకుందని.. ఈ క్రమంలో మహిళలకు రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమైందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం మంగళవారం చేపట్టిన రాష్ట్ర వ్యాప్త నిరసనలు విజయవంతం కావడంపై పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.  

..రాష్ట్రంలో చిన్నారులు, మహిళలకు రక్షణ లేకుండా పోయింది. అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నిందితులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ముచ్చుమర్రి ఘటనపై ఇప్పటివరకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. కానీ, ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టడమే పనిగా ప్రభుత్వం పెట్టుకుంది. అందుకే కూటమి వైఫల్యాలను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా మేం నిరసన చేపట్టాం.  ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో మహిళలు పెద్ద ఎత్తున  పాల్గొన్నారు. 

.. రాష్ట్రంలో చంద్రబాబు పాలన లో మహిళలకి రక్షణలేదు. రాప్తాడు లో 14 ఏళ్ల మైనర్ బాలికను 14 మంది టీడీపీ కార్యకర్తలు అత్యాచారం చేశారు. టీడీపీ కార్యకర్తలను నిన్నటి వరకు అరెస్టు చేయలేదు. ఈ హత్యలు, అత్యాచారాలకు కారణం మద్యం, గంజాయి, డ్రగ్స్. కూటమి అధికారంలోకి వచ్చాక మద్యం, గంజాయి, డ్రగ్స్‌ డోర డెలివరీ అవుతున్నాయి. ఎక్కడ చూసినా బెల్ట్‌ షాపులు కనిపిస్తున్నాయి. పోలీసులు , ప్రభుత్వం నిర్లక్ష్యం వలన అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. 

తన సొంత నియోజకవర్గంలో అఘాయిత్యాలు జరిగినా హోం మంత్రి అనిత పట్టించుకోవడంలేదు. టీడీపీ కార్యకర్తలే మహిళలపట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే అనంతపురం జిల్లాలో చిన్నారి చనిపోయింది. చిన్నారి మృతిపై హోం మంత్రి బాధ్యత తీసుకుని తన పదవికి రాజీనామా చేయాలి. అనంతపురం చిన్నారి మరణం ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే’’ అని వరుదు కళ్యాణి అన్నారు.

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)